Kejriwal On BJP : బీజేపీకి ప్రచారం చేస్తానంటున్న కేజ్రీవాల్.. కానీ ఒక్క కండీషన్-kejriwal wants to campaign for bjp but he has put one condition check what is it ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kejriwal On Bjp : బీజేపీకి ప్రచారం చేస్తానంటున్న కేజ్రీవాల్.. కానీ ఒక్క కండీషన్

Kejriwal On BJP : బీజేపీకి ప్రచారం చేస్తానంటున్న కేజ్రీవాల్.. కానీ ఒక్క కండీషన్

Anand Sai HT Telugu
Oct 06, 2024 05:24 PM IST

Kejriwal Comments On BJP : బీజేపీపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా కరెంటు, నీళ్లు లేకుండా చేయలేదని పేర్కొన్నారు.

కేజ్రీవాల్
కేజ్రీవాల్

దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనతా కీ అదాలత్ సభలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. ఇటీవలి ఎగ్జిట్ పోల్స్ సూచించినట్లుగా హర్యానా, జమ్మూ కాశ్మిర్‌లో బీజేపీ తన పట్టును కోల్పోతోందని, దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ విఫలమైందని ఆయన అన్నారు.

yearly horoscope entry point

జూన్ ఎన్నికల ఫలితాలను కేజ్రీవాల్ ప్రస్తావించారు. బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే సాధించిందన్నారు. వారి ఇంజిన్ ఒకటి ఇప్పటికే విఫలమైందని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ భావన అభివృద్ధి గురించి కాదని, డబుల్ లూట్, డబుల్ అవినీతి గురించి ఆయన ఆరోపించారు.

మణిపూర్ చేయాలనుకుంటున్నారా?

కొన్ని నెలల తర్వాత దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేజ్రీవాల్ తెలిపారు. 'వారు ఇక్కడకు కూడా వచ్చి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని చెబుతారు. ఉత్తరప్రదేశ్‌లో 7 ఏళ్ల పాటు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది. మణిపూర్‌లో 7 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, మణిపూర్ మండుతోంది. మీరు దేశం మొత్తాన్ని మణిపూర్ చేయాలనుకుంటున్నారా?' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

పనులు ఆగనివ్వను

జైలుకు వెళ్లాల్సి వచ్చినా దిల్లీలో అభివృద్ధి పనులు ఆగిపోనివ్వబోమని కేజ్రీవాల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మహిళల భద్రతకు భరోసా కల్పించే ప్రయత్నాలతో సహా ఢిల్లీలోని 3 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులను బీజేపీ అడ్డుకోవద్దని ఆయన కోరారు. బస్ మార్షల్స్, సీసీటీవీ కెమెరాల వంటి కార్యక్రమాల నుండి కుటుంబ సభ్యులు కూడా ప్రయోజనం పొందుతున్నారని కేజ్రీవాల్ గుర్తు చేశారు.

బీజేపీకి ప్రచారం చేస్తా

'దిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ మీ వద్దకు వచ్చి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న పని మేం కూడా చేస్తామని చెబుతోంది. 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఎక్కడైనా కరెంటు, నీళ్లు సరిగా వచ్చేలా చేశారా? గుజరాత్‌లో 30 ఏళ్లుగా అధికారంలో ఉన్నా అక్కడ ఒక్క పాఠశాల కూడా లేదు. ఈ 22 రాష్ట్రాల్లో బీజేపీ కరెంటు ఫ్రీ చేస్తే దిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తాను.' అని కేజ్రీవాల్ చెప్పారు. తన ప్రసంగంలో దిల్లీ వాసులకు అరవింద్ కేజ్రీవాల్ ఆరు హామీలు ఇచ్చారు.

అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు హామీలు

ఉచిత విద్యుత్

ఉచిత నీరు

ఉచిత తీర్థయాత్ర

ఉచిత విద్య

ఢిల్లీలో అందరికీ ఉచిత చికిత్స

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.