Bengaluru rains: బెంగళూరుకు భారీ వర్ష సూచన; వాతావరణ శాఖ హెచ్చరికలు
Bengaluru rains: బెంగళూరు సహా కర్నాటక లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బెంగళూరులో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుతాయని వెల్లడించింది.
Bengaluru rains: బెంగళూరు నగరం సహా కర్నాటక లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ (yellow alert) జారీ చేసింది. మూడు రోజుల పాటు బెంగళూరు సహా ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరించింది.
ట్రెండింగ్ వార్తలు
నవంబర్ 10 వరకు
నవంబర్ 9న కోస్తా కర్ణాటక, ఉత్తర కర్నాటక, దక్షిణ కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, చామరాజనగర్, చిక్కమగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, కొడగు, కోలార్, రామనగర జిల్లాల్లో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ను జారీ చేసింది. అలాగే, కేరళ, తమిళనాడుల్లోనూ నవంబర్ 9వ తేదీన భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ముఖ్యంగా కొంకణ్, గోవా, దక్షిణ మధ్య మహారాష్ట్ర, దక్షిణ కేరళ, దక్షిణ తమిళనాడుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో వర్షపాత తీవ్రతను అంచనా వేసి సంబంధిత అలర్ట్ లను జారీ చేసింది.
బెంగళూరు ఉష్ణోగ్రతలు
బెంగళూరులో పగటి ఉష్ణోగ్రత 29-30 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 10 వరకు బెంగళూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 6న బెంగళూరులో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బెంగళూరు వర్షాలు, వరదలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శాంతినగర్, రామమూర్తి నగర్, బాణసవాడి, మైసూరు రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, శేషాద్రిపురం, కోరమనగల, విజయనగర్, బన్నెరఘట్ట రోడ్, ఇందిరానగర్, బెన్నిగనహళ్లి మెట్రో స్టేషన్‌లలో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది.