karnataka sslc result 2024: 10వ తరగతి ఫలితాలను డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోండి-karnataka sslc result 2024 check direct link online karresults nic in ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Sslc Result 2024: 10వ తరగతి ఫలితాలను డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోండి

karnataka sslc result 2024: 10వ తరగతి ఫలితాలను డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
May 09, 2024 09:35 AM IST

karnataka sslc result 2024: కర్ణాటకలో 10వ తరగతి పరీక్షకు హాజరైన వారు తమ ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్ష ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఇది. కర్ణాటక ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. 10వ తరగతి ఫలితాలను తనిఖీ చేయడానికి ఇక్కడ డైరెక్ట్ లింక్ తెలుసుకోండి.

కర్ణాటక ఎస్ఎస్ఎల్‌సి పరీక్షలకు హాజరైన విద్యార్థులు
కర్ణాటక ఎస్ఎస్ఎల్‌సి పరీక్షలకు హాజరైన విద్యార్థులు (Savitha )

బెంగళూరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక SSLC 2024 ఫలితాలు ఈ రోజు (మే 9) కర్ణాటక బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రకటించనుంది.. KSEAB 10వ ఫలితాలు ఈరోజు (గురువారం) ఉదయం 10.30 గంటలకు ప్రకటిస్తారు.

yearly horoscope entry point

కర్ణాటక SSLC (10వ తరగతి) పరీక్ష మార్చి 25 నుండి ఏప్రిల్ 6 వరకు జరిగింది. SSLC పరీక్ష కన్నడ, తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, ఉర్దూ, ఇంగ్లీష్ మరియు సంస్కృతంతో ప్రారంభమైంది. ఏప్రిల్ 8న జేటీఎస్ విద్యార్థులకు ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలు నిర్వహించారు.

SSLC పరీక్ష 1 మార్చి - ఏప్రిల్‌లో నిర్వహించారు. అన్ని సబ్జెక్ట్ జవాబు పత్రాలు ఇప్పటికే మూల్యాంకనం చేశారు. SSLC పరీక్ష 1 ఫలితాలను మే 9వ తేదీన ఉదయం 10.30 గంటలకు బెంగళూరులోని మల్లేశ్వరంలోని కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ ఎవాల్యుయేషన్ బోర్డులో విలేకరుల సమావేశంలో ప్రకటిస్తామని బోర్డు అధ్యక్షురాలు ఎన్ మంజుశ్రీ తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం అన్ని పాఠశాలల్లో ఫలితాలు వెల్లడిస్తారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో కూడా తనిఖీ చేయవచ్చు.

కర్ణాటక SSLC ఫలితాలు 2024; 10వ తరగతి ఫలితాలను తనిఖీ చేయడానికి డైరెక్ట్ లింక్

రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ కర్ణాటక ఫలితాల అధికారిక వెబ్‌సైట్ karresults.nic.in లో లేదా kseab.karnataka.gov.in లో నేరుగా లింక్ ద్వారా కర్ణాటక SSLC ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు.

అధికారిక పత్రికా ప్రకటనలో “కర్ణాటక బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎవాల్యుయేషన్ 10వ తరగతి ఫలితాలను ప్రకటించడానికి మే 9 ఉదయం 10.30 గంటలకు విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. కర్ణాటక SSLC ఫలితాలను ఉదయం 10.30 గంటల తర్వాత karresults.nic.in లో చూడవచ్చు..’ అని తెలిపింది.

కర్ణాటక SSLC ఫలితాలు 2024 ప్రచురించబడే ప్రభుత్వ వెబ్‌సైట్‌లు ఇవి

sslc.karnataka.gov.in

కర్ణాటక SSLC ఫలితాలు 2024; 10వ తరగతి ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోవాలి

1) కర్ణాటక బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎవాల్యుయేషన్ karresults.nic.in అధికారిక ఫలితాల వెబ్‌సైట్‌కి వెళ్లండి

2) హోమ్ పేజీలో “2024 SSLC మెయిన్ ఎగ్జామినేషన్ రిజల్ట్”పై క్లిక్ చేయండి

3) ఆపై మీ SSLC రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి

4) ఆపై మీ SSLC ఫలితాలు 2024 లేదా 10వ తరగతి ఫలితాలు సిస్టమ్ (డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్/మొబైల్) స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీనిని పరిశీలించండి.

5) మీ SSLC ఫలితాలు 2024 లేదా 10వ తరగతి ఫలితాల పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకొని భవిష్యత్తు అవసరాల కోసం ఉంచండి.

కర్ణాటకలో ఈసారి 8.69 లక్షల మంది విద్యార్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 4.41 లక్షల మంది బాలురు, 4.28 లక్షల మంది బాలికలు ఉన్నారు. అలాగే, కర్ణాటకలోని 2,750 పరీక్షా కేంద్రాల్లో 18,225 మంది ప్రైవేట్ విద్యార్థులు, 41,375 మంది రిపీట్ విద్యార్థులు, 5,424 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు హాజరయ్యారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.