Viveka Classrooms: క్లాస్‍రూమ్‍లకు కాషాయం.. వివాదంగా మారుతున్న ప్రభుత్వ నిర్ణయం!-karnataka govt to colour code viveka classrooms in saffron ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Karnataka Govt To Colour Code Viveka Classrooms In Saffron

Viveka Classrooms: క్లాస్‍రూమ్‍లకు కాషాయం.. వివాదంగా మారుతున్న ప్రభుత్వ నిర్ణయం!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 14, 2022 04:01 PM IST

Viveka Classrooms in Karnataka: కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఎం బొమ్మై కూడా స్పందించారు.

మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నివాళి అర్పిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నివాళి అర్పిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై (Arunkumar Rao)

Viveka Classrooms in Karnataka: కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇటీవల వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కార్ కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా క్లాస్ రూమ్‍లకు కాషాయ రంగు వేయించాలని నిర్ణయించింది. వివేకా క్లాస్ రూమ్‍ల పేరిట కొత్త పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) తీసుకొచ్చింది. దీని కింద ప్రభుత్వ పాఠశాల్లో తరగతి గదులను నిర్మించనుంది.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో కొత్తగా సుమారు కొత్తగా 10వేల తరగతి గదులను నిర్మించాలని బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరగతి గదులకు స్వామి వివేకానంద (Swami Vivekananda) పేరును పెట్టనుంది. ఈ పథకానికి వివేకా అని నామకరణం చేసింది. మొత్తంగా రూ.992 కోట్ల నిధులతో ఈ క్లాస్ రూమ్‍లను నిర్మించనుంది. బాలల దినోత్సవం (Children’s Day) సందర్భంగా కలబురిగిలో సీఎం బసవరాజ్ బొమ్మై (CM Basavaraj Bommai) ఈ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ (BC Nagesh) కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Viveka Classrooms in Karnataka: వారి సూచనతోనే..

తరగతి గదులకు కాషాయ రంగు వేయాలన్న నిర్ణయాన్ని కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్ సమర్థించుకున్నారు. అర్కిటెక్చర్ల ప్రతిపాదనల మేరకే ఈ రంగును ఎంపిక చేసినట్టు చెప్పారు. “దీంట్లో ఏమైనా తప్పు ఉందా? కాషాయం ఓ రంగు కాదా? ఆర్కిటెక్ట్ లు కాషాయ రంగును సూచిస్తే.. దాన్నే పెయింట్ చేయిస్తాం. కిటికీలు, తలుపులు, మెట్లు ఏ రంగులో ఉండాలో ప్రభుత్వం నిర్ణయించదు. మాకు అర్కిటెక్ట్ లు ఉన్నారు, వారి ప్రతిపాదనల మేరకే మేం నిర్ణయం తీసుకుంటాం” అని మంత్రి నగేశ్ అన్నారు.

కాంగ్రెస్ జెండాలోనూ కాషాయం ఉంది కదా?: మంత్రి నగేశ్

Viveka Classrooms in Karnataka: క్లాస్ రూమ్‍లకు కాషాయ రంగు నిర్ణయంపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై ఎదురుదాడి చేశారు కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్. “కాషాయమంటే కొందరికి అలర్జీగా ఉంది. వారి (కాంగ్రెస్) పార్టీ జెండాలోనూ కాషాయం ఉంది. మరి వారు ఎందుకు అలాగే ఉంచారు? దాన్ని తొలగించి, పూర్తి ఆకుపచ్చ రంగులో ఉంచొచ్చు కదా” అని నగేశ్ స్పందించారు.

ప్రతీది రాజకీయం చేయొద్దు: సీఎం బొమ్మై

బెంగళూరులోని విధాన సభ ముందున్న మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం బసరవాజ్ బొమ్మై మాట్లాడారు. ప్రతీ విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదని సూచించారు.

“జాతీయ జెండాలో కాషాయ రంగు ఉంది. దీనిపై (కాషాయ రంగు) వారికి ఆగ్రహం ఎందుకు? స్వామి వివేకానంద పేరుతో పాఠశాల భవనాలు నిర్మిస్తున్నాం. ఆయన మహానుభావుడు. కాషాయ వస్త్రాలు ధరిస్తారు. వివేకా అనే పదానికి జ్ఞానం అని అర్థం. వారిని (విపక్షాలు) తెలుసుకోనివ్వండి” అని సీఎం బొమ్మై అన్నారు.

IPL_Entry_Point