Karnataka polls: కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మాజీ ఉప ముఖ్యమంత్రి
Karnataka polls: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్నాటక (Karnataka) లో రాజకీయం వేడెక్కుతోంది. టికెట్లు దక్కని నాయకులు ప్రత్యర్థి పార్టీల్లో అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు.
Karnataka polls: కర్నాటక (Karnataka) మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ బీజేపీ (BJP) సీనియర్ నేత లక్ష్మణ్ సావడి (Laxman Savadi) శుక్రవారం కాంగ్రెస్ (Congress) లో చేరారు. రెండు రోజుల క్రితమే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్ల బీజేపీ నాయకత్వం తనకు టికెట్ ఇవ్వకపోవడంతో, ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
BJP leader joins Congress: సీనియర్లతో భేటీ..
కాంగ్రెస్ లో చేరేముందు లక్ష్మణ్ సావడి (Laxman Savadi) కర్నాటక కాంగ్రెస్ అగ్ర నేతలు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధ రామయ్యలతో సమావేశమయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తన అభ్యర్థిత్వంపై డీకే శివకుమార్, సిద్ధరామయ్యల నుంచి కచ్చితమైన హామీ తీసుకున్న తరువాతనే లక్ష్మణ్ సావడి (Laxman Savadi) కాంగ్రెస్ లో చేరినట్లు సమాచారం. అథానీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని లక్ష్మణ్ సావడి (Laxman Savadi) భావించారు.కానీ ఆ స్థానంలో సిటింగ్ ఎమ్మెల్యే మహేశ్ కుమతలికి బీజేపీ అవకాశం కల్పించింది. దాంతో, లక్ష్మణ్ సావడి బీజేపీకి రాజీనామా చేశారు.
Karnataka polls: అవమానాలు ఎదుర్కొన్నా..
లక్ష్మణ్ సావడి బీజేపీ తరఫున అథానీ స్థానం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 లో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ కుమతలి చేతిలో ఓడిపోయారు. అయితే, 2019 లో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి, బీజేపీ అధికారంలోకి రావడం కోసం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో మహేశ్ కుమతలి కూడా ఉన్నారు. దాంతో, ఈ ఎన్నికల్లో బీజేపీ ఆయనకే సీట్ కన్ఫర్మ్ చేసింది. బీజేపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని లక్ష్మణ్ సావడి (Laxman Savadi) చెప్పారని కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. "లక్ష్మణ్ సావడి (Laxman Savadi) మంచి నాయకుడు. అలాంటి నాయకులను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం మా బాధ్యత. నిజానికి, మరో 10 మంది బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి అవకాశం కల్పించే పరిస్థితి లేనందువల్ల నిర్ణయాన్ని వాయిదా వేశాం’’ అని శివకుమార్ వ్యాఖ్యానించారు.
Laxman Savadi is a three-time MLA from Athani but lost in the 2018 elections to Kumathalli (then in the Congress). Kumathalli was among the group of defectors who helped the BJP to bring down the Congress-JD(S) coalition and form its government under the leadership of B S Yediyurappa in 2019.