Kangana Ranaut's hint at joining politics: రాజకీయాలపై కంగన లేటెస్ట్ కామెంట్-kangana ranaut s hint at joining politics if bjp wants me for himachal polls ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Kangana Ranaut's Hint At Joining Politics: 'If Bjp Wants Me For Himachal Polls'

Kangana Ranaut's hint at joining politics: రాజకీయాలపై కంగన లేటెస్ట్ కామెంట్

HT Telugu Desk HT Telugu
Oct 29, 2022 09:02 PM IST

Kangana Ranaut's hint at joining politics: రాజకీయాల్లోకి రావడంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ హింట్ ఇచ్చారు. బీజేపీకి బహిరంగంగానే మద్దతు పలికే కంగనా.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు.

బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్
బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ (File)

Kangana Ranaut's hint at joining politics: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, జాతీయ ఉత్తమ నటి కంగన రనౌత్ తన రాజకీయ భవిష్యత్తుపై సూచనలు చేశారు. చాలా కాలం నుంచే ఆమె బీజేపీకి మద్దతుగా స్టేట్మెంట్లు ఇస్తున్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Kangana Ranaut's hint at joining politics: సొంత రాష్ట్రం నుంచి..

కంగన రనౌత్ సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో, సొంత రాష్ట్రం నుంచి బీజేపీ తరఫు ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన ఆకాంక్షను ఆమె శనివారం వెల్లడించారు. ఒక టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పారు.

Kangana Ranaut's hint at joining politics: బీజేపీ టిక్కెట్టిస్తే..

బీజేపీ టికెట్ ఇస్తే, హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టంచేశారు. ఇక్కడ నా అవసరం ఉందని బీజేపీ భావిస్తే, ఏ విధమైన సహకారం అందించడానికైనా నేను సిద్ధమే. హిమాచల్ ప్రజలు కానీ, బీజేపీ కానీ నేను ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరుకుంటే, అది నేను గౌరవంగా భావిస్తాను’ అని ఆమె వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని నెల క్రితమే కంగన వ్యాఖ్యానించడం విశేషం. ‘రాజకీయాలు కాదు, సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టాల్సి ఉంది’ అని అప్పుడు ఆమె అన్నారు.

Kangana Ranaut's hint at joining politics: పార్టీలో చేరడం వరకు ఓకే.. కానీ..

అయితే, అక్కడే ఉన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా దీనిపై స్పందించారు. కంగన రనౌత్ పార్టీలో చేరాలనుకుంటే, అందుకు మనస్ఫూర్తిగా స్వాగతిస్తామన్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేసే విషయం పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడ్తాయి. కంగన రనౌత్ వంటి డైనమిక్ వ్యక్తులు బీజేపీలోకి రావడం అభిలషనీయమన్నారు.

IPL_Entry_Point