Noor Malabika Das : ‘ది ట్రైల్​’ నటి నూర్​ మాలాబికా దాస్​ మృతి- ఆత్మహత్య చేసుకుని..!-kajols co star noor malabika das found dead at home police suspect suicide ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Noor Malabika Das : ‘ది ట్రైల్​’ నటి నూర్​ మాలాబికా దాస్​ మృతి- ఆత్మహత్య చేసుకుని..!

Noor Malabika Das : ‘ది ట్రైల్​’ నటి నూర్​ మాలాబికా దాస్​ మృతి- ఆత్మహత్య చేసుకుని..!

Sharath Chitturi HT Telugu
Jun 10, 2024 02:23 PM IST

‘ది ట్రైల్​’ వెబ్​ సిరీస్​లో కాజోల్​తో కలిసి నటించిన నటి నూర్​ మాలాబికా దాస్​ మరణించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

నూర్​ మాలాబికా దాస్​
నూర్​ మాలాబికా దాస్​

Noor Malabika Das death : నటి నూర్​ మాలాబికా దాస్​.. ముంబైలోని తన ఫ్లాట్​లో మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నూర్​ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు.

2023లో విడుదలైన లీగల్​ డ్రామా 'ది ట్రైల్​' వెబ్​ సిరీస్​లో ప్రముఖ బాలీవుడ్​ నటి కాజోల్​తో కలిసి నటించారు నూర్​ మాలాబికా దాస్​. ఆమె వయస్సు 37ఏళ్లు అని సమాచారం.

నూర్​ మాలాబికా దాస్​ మృతి..

నూర్​ మాలాబికా దాస్​ మరణం అందరిని షాక్​కు గురిచేస్తోంది. ఆమె స్వస్తలం అసోం. కాగా.. ఆమె ఫ్లాట్​ నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమచారం ఇచ్చారని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్​ఐ చెప్పింది. పోలీసులు ఫ్లాట్​కి వెళ్లగా.. కుళ్లిపోయిన దశలో ఆమె మృతదేహం కనిపించినట్టు వివరించింది.

"నూర్​ మాలాబికా దాస్​ మృతదేహం.. కుళ్లిపోయిన దశలో పోలీసులకు కనిపించింది. అంధేరీలోని ఆమె నివాసంలో పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు చెప్పడంతో.. వారు ఫ్లాట్​ తలుపును తెరవగా.. నూర్​ మాలాబికా దాస్​ మరణించారన్న వార్త బయటకు వచ్చింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు," అని ఏఎన్​ఐ వెల్లడించింది.

Noor Malabika Das death reason : మిడ్​-డే రిపోర్టు ప్రకారం.. ఈ ఘటన జూన్​ 6న జరిగింది! ఘటనాస్థలం నుంచి నూర్​ మాలాబికా దాస్​ వాడే ఔషదాలు, ఆమె మొబైల్​ ఫోన్​, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూర్​ మరణాన్ని ఆమె కుటుంబసభ్యులకు పోలీసులు వెల్లడించారు. కానీ ఎవరూ వచ్చి మృతదేహాన్ని తీసుకోలేదు. ఫలితంగా.. మామ్దాని హెల్త్​ అండ్​ ఎడ్జ్యుకేషన్​ ట్రస్ట్​ ఎన్​జీఓ సహాయంతో.. నూర్​ మాలాబికా దాస్​ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు పోలీసులు.

"ఆమె కుటుంబంతో మాట్లాడాము. వారు 2 వారాల ముందు స్వస్తలానికి వెళ్లారు. మృతదేహాన్ని తీసుకునేందుకు రాలేదు. ఇది ఆత్మహత్య అని అనుమానిస్తున్నాము. ఘటనపై కేసు నమోదు చేసుకున్నాము. దర్యాప్తు కొనసాగుతోంది," అని పోలీసులు వెల్లడించారు.

‘కొన్ని రోజుల ముందు వరకు..’

నూర్​ మాలాబికా దాస్​ మరణంపై ఆమె స్నేహితుడు అలోక్​నాథ్​ పాథక్​ స్పందించారు.

Noor Malabika Das suicide : "ఈ వార్త విని షాక్​ అయ్యాను. నూర్​ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. చాలా కాలం కలిసి పనిచేశాము. గత నెల వరకు కూడా.. ముంబైలోని ఫ్లాట్​లో తన కుటుంబంతో జీవించింది. కొన్ని రోజుల క్రితమే.. వారు తమ ఊరికి వెళ్లారు. ఈ ఫ్లాట్​లో రెంట్​కి ఉంటోంది," అని చెప్పారు.

సిస్కియాన్​, వాల్క్​మన్​, టీకీ చట్నీ, చరమ్​సుఖ్​ సహా పలు హిందీ సినిమాలు, వెబ్​ సిరీస్​లలో పనిచేశారు నూర్​ మాలాబికా దాస్​. ట్రైల్​లో కాజోల్​, జిషు సెన్​గుప్తాతో పనిచేశారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం