Kabul suicide blast: క్లాస్ రూమ్ లో ఆత్మాహుతి దాడి; 100 మంది దుర్మరణం-kabul suicide blast kills 100 mostly girls at education centre ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Kabul Suicide Blast Kills 100, Mostly Girls, At Education Centre

Kabul suicide blast: క్లాస్ రూమ్ లో ఆత్మాహుతి దాడి; 100 మంది దుర్మరణం

HT Telugu Desk HT Telugu
Sep 30, 2022 03:22 PM IST

100 killed in Kabul suicide blast: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. పరీక్ష రాయడానికి వచ్చి, కిక్కిరిసి ఉన్న తరగతి గదిలో ఒక రాక్షసుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

ఆత్మాహుతి దాడి జరిగిన క్లాస్ రూమ్
ఆత్మాహుతి దాడి జరిగిన క్లాస్ రూమ్

100 killed in Kabul suicide blast: కాబూల్ శివార్లలోని ఒక పాఠశాలలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక మాక్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 100 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా చెబుతోంది. కానీ, 19 మంది చనిపోయారు, 20 మంది గాయపడ్డారని అధికారులు, పోలీసులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

100 killed in Kabul suicide blast: బాలికలే ఎక్కువ

కాబూల్ శివార్ల లోని ఒక విద్యా సంస్థ ‘కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్’ లో త్వరలో జరగబోయే ఒక యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్ష కు సంబంధించి శుక్రవారం ఉదయం మాక్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. వారిలో బాలికల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఆత్మాహుతి దాడి జరిగిన తరగతి గదిలో దాదాపు 600 మంది వరకు ఉన్నారని గాయపడిన ఒక విద్యార్థి తెలిపాడు. పరీక్ష జరుగుతుండగా, విద్యార్థి గా వచ్చిన దుండగుడు తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

100 killed in Kabul suicide blast: వంద మృతదేహాలను లెక్కించాం..

అయితే, ఈ ఆత్మాహుతి దాడిలో కనీసం 100 మంది పిల్లలు చనిపోయారని స్థానిక జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న తరువాత తామే దాదాపు 100 మృతదేహాలను లెక్కించామని ఆయన ట్వీట్ చేశాడు. అయితే, ఈ ఘటనలో 19 మంది చనిపోయారని, 27 మంది గాయపడ్డారని స్థానిక పోలీసు అధికారి ఖాలిద్ జర్దాన్ వెల్లడించారు. అయితే, ఈ ఆత్మాహుతి దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు.

IPL_Entry_Point