Jupiter closest to Earth : భూమికి అత్యంత సమీపంగా జూపిటర్​.. ఎప్పుడంటే!-jupiter closest to earth in 6 decades tomorrow see how to watch ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jupiter Closest To Earth In 6 Decades Tomorrow, See How To Watch

Jupiter closest to Earth : భూమికి అత్యంత సమీపంగా జూపిటర్​.. ఎప్పుడంటే!

Sharath Chitturi HT Telugu
Sep 25, 2022 03:01 PM IST

Jupiter closest to Earth : జూపిటర్​ గ్రహం.. భూమికి అత్యంత సమీపంగా రానుంది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది.

భూమకిి అత్యంత సమీపంగా జూపిటర్​
భూమకిి అత్యంత సమీపంగా జూపిటర్​

Jupiter closest to Earth : ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది! ఆరు దశాబ్దాల అనంతరం.. భూమికి జూపిటర్​ గ్రహం అత్యంత సమీపంగా రానుంది. సోమవారం రాత్రి మొత్తం మీద.. జూపిటర్​ని చూడవచ్చు. ఈ విషయాన్ని అమెరికా స్పేస్​ ఏజెన్స్​ నాసా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

సౌర మండలంలో అతిపెద్ద గ్రహంగా జూపిటర్​కు గుర్తింపు ఉంది. భూమి నుంచి జూపిటర్​ సుమారు 600 మిలియన్​ మైళ్ల దూరంలో ఉంటుంది. 1963 తర్వాత.. జూపిటర్​ తొలిసారిగా భూమికి అత్యంత సమీపంగా రానుంది.

Jupiter closest approach to earth 2022 : "స్టార్​గేజర్స్​.. జూపిటర్​ గ్రహం భూమికి అత్యంత సమీపంగా రానుంది. ఈనెల 26 రాత్రి.. బైనాక్యులర్స్​ సాయంతో జూపిటర్​ని చూసేయవచ్చు. గ్రేట్​ రెడ్​ స్పాట్​ని చూడాలి అని అనుకుంటే మాత్రం.. పెద్ద టెలిస్కోప్​ అవసరం పడుతుంది," అని నాసా వెల్లడించింది.

ఇక రెండు గ్రహాలు.. అత్యంత సమీపంలో ఉన్నప్పుడు వాటి మధ్య దూరం రూ. 367మిలియన్​ మైళ్లుగా ఉంటుందని నాసా పేర్కొంది. 1963లో కూడా సుమారు ఇంతే దూరం ఈ రెండు గ్రహాల మధ్య ఉండటం గమనార్హం.

Jupiter closest approach to earth : ఈ ప్రక్రియను నాసా శాస్త్రవేత్తలు 'ఆపోజీషన్'​గా పిలుస్తున్నారు. భూమి నుంచి చూసినప్పుడు.. సూర్యుడు పశ్చిమాన అస్తమించిన సమయంలో.. తూర్పువైపు ఏదైనా ఖగోళ వస్తువు ఉదయించడాన్ని ఆపోజిషన్​ అంటారు. ఈ ప్రక్రియ ఇప్పుడు జూపిటర్​- భూమి మధ్య చోటుచేసుకోనుంది. ఇది చాలా అరుదైన విషయం! జూపిటర్​, భూమికి సమీపంగా వచ్చిన ప్రతిసారీ ఇలా జరగాలని లేదు.

'వాతావరణ బాగుండి, మబ్బులు లేకపోతే మంచిది. ఎత్తైన, చీకటి ప్రదేశాల్లో జూపిటర్​ను మరింత ప్రకాశవంతంగా చూడవచ్చు,' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జూపిటర్​ చంద్రుడు యూరోపా మీదకు 'యూరోపా క్లిప్పర్​' అనే స్పేస్​క్రాఫ్ట్​ను పంపించేందుకు నాసా ప్రయత్నిస్తోంది. మానవాళి మనుగడకు అక్కడ సౌకర్యాలు ఉన్నాయా? లేదా? తెలుసుకోవడం ఈ మిషన్​ లక్ష్యం. అక్టోబర్​ 2024లో ఇది లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం