ునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ జూలై 2025 వీసా బులెటిన్ విడుదలైంది. ఇది భారతీయ గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈబీ-1, ఈబీ-2 వంటి కీలక ఉద్యోగ ఆధారిత కేటగిరీల తేదీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈబీ-3 తుది కార్యాచరణ తేదీ మరో వారం రోజులు కొనసాగనుంది. ఫ్యామిలీ స్పాన్సర్డ్ కేసుల కింద కొన్ని కేటగిరీల్లో ఎక్కువ తేదీ మార్పులు ఉన్నాయి.
భారత్ నుంచి గ్రీన్ కార్డు ఆశావహులు వచ్చే నెలలో ఏం ఆశించవచ్చో చూద్దాం.. జూలై 2025 యూఎస్ సీఐఎస్ వీసా బులెటిన్ కీలక అంశాలు, ముఖ్యమైన తేదీలు..
ఎఫ్ 1 (అమెరికా పౌరుల అవివాహిత కుమారులు, కుమార్తెలు): జూన్ 8, 2016 నుంచి జూలై 15, 2016 వరకు ఒక నెలకుపైగా పెరిగింది.
ఎఫ్ 2ఎ (శాశ్వత నివాసితుల జీవిత భాగస్వాములు, పిల్లలు): జనవరి 1, 2022 నుండి సెప్టెంబర్ 1, 2022 వరకు గణనీయమైన పెరుగుదల ఉంది.
ఎఫ్ 2బి (అవివాహిత కుమారులు, కుమార్తెలు - 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు - శాశ్వత నివాసితులు): కొత్త తేదీ అక్టోబర్ 15, 2016, మునుపటి సెప్టెంబర్ 22, 2016 నుండి పెరిగింది.
ఎఫ్ 3 (అమెరికా పౌరుల వివాహిత కుమారులు, కుమార్తెలు): జూన్ 22, 2011 నుంచి ఆగస్టు 1, 2011కి మారింది.
F4 (వయోజన యూఎస్ పౌరుల సోదర సోదరీమణులు): కొత్త తేదీ జూలై 8, 2006, ఇంతకు ముందు ఇది జూన్ 15, 2006.
ఈబీ-3 (స్కిల్డ్ వర్కర్స్): 2013 ఏప్రిల్ 15 నుంచి 2013 ఏప్రిల్ 22 వరకు.
ఎఫ్ 2ఎ (శాశ్వత నివాసితుల జీవిత భాగస్వాములు, పిల్లలు): ఫిబ్రవరి 1, 2025 నుండి మార్చి 1, 2025 వరకు ఒక నెల పెరుగుదల.
F4 (వయోజన యూఎస్ పౌరుల సోదర సోదరీమణులు): అక్టోబర్ 1, 2006 నుండి డిసెంబర్ 1, 2006 వరకు.
అన్ని కేటగిరీల్లో వీసా దరఖాస్తులు దాఖలు చేసే తేదీల్లో ఎలాంటి మార్పు లేదు.