JNU PG Admission 2023 : పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించిన జేఎన్​యూ..-jnu pg admission 2023 registration process begins for pg and adop programmes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jnu Pg Admission 2023 : పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించిన జేఎన్​యూ..

JNU PG Admission 2023 : పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించిన జేఎన్​యూ..

Sharath Chitturi HT Telugu
Jul 28, 2023 01:19 PM IST

JNU PG Admission 2023 : పీజీతో పాటు పలు ఇతర ప్రోగ్రామ్స్​కు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది జేఎన్​యూ. ఆ వివరాలు..

పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించిన జేఎన్​యూ..
పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించిన జేఎన్​యూ..

JNU PG Admission 2023 : 2023-24 విద్యా సంవత్సరంలో పీజీ, ఏడీఓపీ ప్రోగ్రామ్స్​కు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది ఢిల్లీలోని జేఎన్​యూ (జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీ). గురువారం ప్రారంభమైన అడ్మిషన్​ ప్రాసెస్​.. ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. అంటే.. అభ్యర్థులు, తమ అప్లికేషన్​లను ఆగస్టు 10 నాటికి సమర్పించాల్సి ఉంటుంది. jnuee.jnu.ac.in లోకి వెళ్లి రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు.

ఆ పరీక్ష ఫలితాల ఆధారంగా..

సీయూఈటీ పీజీ 2023 పరీక్ష ఫలితాల ఆధారంగా జేఎన్​యూలోని ఎంఏ, ఎంఎస్​సీ, ఎంసీఏ, ఎంపీహెచ్​, ఎంటెక్​, పీజీ, అడ్వాన్స్​డ్​ డిప్లమా ప్రొగ్రామ్స్​కు సంబంధించిన అడ్మిషన్​ జరుగుతుంది. ఎన్​టీఏ అప్లికేషన్​ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్​ను జేఎన్​యూ అధికారిక వెబ్​సైట్​లో సబ్మీట్​ చేయాల్సి ఉంటుంది.

"సీయూఈటీ పీజీ 2023 పరీక్షకు హాజరైన తర్వాత, జేఎన్​యూను ఎంచుకున్న అభ్యర్థులు.. తమ అప్లికేషన్లను 27 జులై నుంచి 10 ఆగస్టు మధ్యలో సబ్మీట్​ చేయాల్సి ఉంటుంది," అని విశ్వవిద్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

నోటిఫికేషన్​లోని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ కింద ఇచ్చిన పీడీఎఫ్​ను చూడండి..

ఇలా రిజిస్టర్​ చేసుకోండి..

స్టెప్​ 1:- జేఎన్​యూ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి. హోం పేజ్​ మీద ఉన్న అప్లై లింక్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 1:- అప్లికేషన్​ ఫామ్​ను నింపండి.

స్టెప్​ 2:- సంబంధిత డాక్యుమెంట్స్​ను సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 3:- అప్లికేషన్​ ఫీజు చెల్లించండి

స్టెప్​ 4:- అప్లికేషన్​ ఫామ్​ను సబ్మీట్​ చేసి, ప్రింటౌట్​ తీసుకోండి.

అయితే.. అప్లికేషన్​ దాఖలుకు ముందు.. అభ్యర్థులు ఒక్కసారి ఎలిజెబులిటీ క్రైటీరియాను చూసుకోవడం ఉత్తమం.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం