Train Accident : పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్.. ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు
Train Accident : జార్ఘాండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా సీసీఎంటీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు, 20 మందికి గాయాలు అయ్యాయి.
ముంబై-హౌరా మెయిల్ 18 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ఇద్దరు మృతి చెందారు. 20 మందికి గాయాలు అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలో ముంబై-హౌరా మెయిల్‌కు చెందిన 18 కోచ్‌లు పట్టాలు తప్పినట్టుగా అధికారులు తెలిపారు.

సౌత్ ఈస్ట్ రైల్వేలోని చక్రధర్ పూర్ డివిజన్ పరిధిలోని జంషెడ్‌పూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని బడాబాంబూ సమీపంలో తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ రైలు రాజ్‌ఖర్స్వాన్ నుంచి బడాబాంబో వైపు వెళ్తోంది. మరోవైపు చక్రధర్ పూర్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు మరో ట్రాక్‌పైకి బోగీలు ఒరిగిపోయాయి. వెనక నుంచి అదే లైన్‌లో వచ్చిన హౌరా-ముంబై ట్రైన్ బోగీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 18 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
ఈ సమయంలో ప్రమాదాన్ని ముందే గ్రహించడటంతో హౌరా ముంబై రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, 20 మంది గాయపడ్డారు. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. NDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
వీటిలో 16 ప్యాసింజర్ కోచ్‌లు, ఒక పవర్ కార్, ఒక ప్యాంట్రీ కార్ అని అధికారులు చెప్పారు. గాయపడిన ప్రయాణికులకు బారాబాంబూలో వైద్య సహాయం అందించి మెరుగైన చికిత్స కోసం చక్రధర్‌పూర్‌కు తరలించినట్లు వెల్లడించారు.
టాపిక్