Child marriages: ఈ రాష్ట్రాలు బాల్య వివాహాలకు కేరాఫ్..
Child marriages: బాల్య వివాహాల విషయంలో జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు రికార్డు సృష్టించాయి. ఈ రాష్ట్రాల్లో జరిగే వివాహాల్లో సగానికి పైగా వధువులు 21 ఏళ్ల లోపు వారే.
Child marriages: బాల్య వివాహాలు ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే.. జార్ఖండ్ లో అత్యధికంగా జరుగుతున్నాయి. బాల్య వివాహాలకు సంబంధించి దేశ వ్యాప్త సగటు 1.9 ఉండగా, అది జార్ఖండ్ 5.8గా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
Child marriages: కేంద్ర సర్వే
ఇటీవల రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ నిర్వహించిన సర్వేలో సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న బాల్య వివాహాల వంటి దురాచారాల విషయం వెల్లడయింది. మేజర్లు కాకముందే జార్ఖండ్ లో వివాహాలు అవుతున్న ఆడ పిల్లల సగటు 5.8 కాగా, అది కేరళలో సున్నా మాత్రమే. జార్ఖండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సగటు 7. 3 గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 3 గా ఉంది. ఈ సర్వేను 2020లో జరిపారు.
Child marriages: పశ్చిమబెంగాల్లో..
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 54.9 శాతం బాలికలకు 21 ఏళ్లు రాకముందే పెళ్లి అవుతోంది. జార్ఖండ్ లో ఇది 54.6 శాతంగా ఉంది. ఈ విషయంలో జాతీయ సగటు 29.5 శాతంగా ఉంది. మరోవైపు, చేతబడులు, మంత్రతంత్రాల అభియోగాలపై జార్ఖండ్ లో 2015లో 32 మందిని, 2016లో 27 మందిని, 2017లో 19 మందిని, 2018లో 18 మందిని, 2019, 2020ల్లో 15 మంది చొప్పున చంపేశారు. బాలికలు, మహిళలపై నేరాల విషయంలో జార్ఖండ్ రాష్ట్రం దారుణమైన రికార్డును మూటకట్టుకుంది.