Jharkhand crime news : బంధువును చంపి.. తలతో సెల్ఫీలు దిగి..!
Jharkhand crime news : 24ఏళ్ల బంధువును దారుణంగా హత్య చేశాడు ఓ 20ఏళ్ల వ్యక్తి. అక్కడే ఉన్న అతడి స్నేహితులు.. మృతుడి తలతో సెల్ఫీలు దిగారు. ఈ ఘటన ఝార్ఖండ్లో చోటుచేసుకుంది.
Jharkhand crime news : ఝార్ఖండ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా సాగుతున్న భూ వివాదం.. చివరికి ఓ కుటుంబంలో తీవ్ర దుఖాన్ని మిగిల్చింది. 20ఏళ్ల వ్యక్తి.. తన బంధువును కిడ్నాప్ చేసి హత్య చేశాడు. అక్కడే ఉన్న అతని స్నేహితులు.. మృతుడి తలతో సెల్ఫీలు దిగారు!
భూవివాదం.. చివరికి..!
దసాయ్ ముండా అనే 55ఏళ్ల వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి కుంటి జిల్లాలోని ముర్హులో నివాసముంటున్నాడు. అతనికి సాగర్ ముండా అనే పేరుతో బంధువు ఉన్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది.
కాగా.. ఈ నెల 1వ తేదీన.. పొలం పనుల కోసం దసాయ్ ముండా కుటుంబం బయటకు వెళ్లింది. అతని కుమారుడు కాను ముండా ఒక్కడే ఇంట్లో ఉండిపోయాడు. దసాయ్ ముండా తిరిగి ఇంటికి వెళ్లేసరికి కొడుకు కనిపించలేదు.
Man beheads cousin : కాను ముండాను 20ఏళ్ల సాగర్ ముండా కిడ్నాప్ చేసినట్టు.. స్థానికులు దసాయ్ ముండాకు వివరించారు. కాను ముండాను వెతికేందుకు కుటుంబసభ్యులు పరుగులు తీశారు. ఎంత వెతికినా కాను ముండా ఆచూకీ లభించలేదు. చివరికి మరుసటి రోజు అతను పోలీసులను ఆశ్రయించాడు.
దసాయ్ ముండా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ముర్హు పోలీస్ స్టేషన్ అధికారులు.. రంగంలోకి దిగారు. సాగర్ ముండా.. అతని స్నేహితులతో కలిసి కాను ముండాను కిడ్నాప్ చేసినట్టు తెలుసుకున్నారు. 2వ తేదీనే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సాగర్ ముండా, అతడి భార్య కూడా ఉన్నారు.
Jharkhand Man beheads relative : విచారణలో భాగంగా.. కాను ముండాను హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు. మృతదేహం కోసం వెతికేందుకు పోలీసులు ప్రయత్నించేందుకు ప్రయత్నించారు. దుల్వా టుంగ్రీ ప్రాంతానికి 15కి.మీల దూరంలో మొండెం పడి ఉండటాన్ని గుర్తించారు. అది కాను ముండాదేనని నిర్ధారించారు.
ఈ క్రమంలోనే పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. కాను ముండాను హత్య చేసిన నిందితులు.. అతని తలను శరీరం నుంచి వేరు చేశారు. తలతో సెల్ఫీలు దిగారు.
Crime news India : ఘటనకు సంబంధించిన ఫొటోలను.. నిందితుల ఫోన్లలో చూశారు పోలీసులు. 5 సెల్ఫోన్స్, హత్య కోసం ఉపయోగించిన రెండు ఆయుధాలు, ఓ గొడ్డలి, ఓ ఎస్యూవీని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తును ముమ్మరంగా జరిపి, నిందితులను కఠినంగా శిక్షిస్తామని.. కాను ముండా కుటుంబానికి పోలీసులు హామీనిచ్చారు.
సంబంధిత కథనం