జేఈఈ 2025 (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) రాస్తున్న పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. వీరి కోసం పరీక్ష సమయంలో స్క్రైబ్స్ని అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ). ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ని జారీ చేసింది. అంతేకాదు పీడబ్ల్యూడీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థుల కోసం పరీక్షలో అదనపు సమయాన్ని కూడా ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే ఆయా అభ్యర్థులు డిసెబులిటీకి సంబంధిత డాక్యుమెంట్స్‌ని కచ్చితంగా చూపించాల్సి ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది.
జేఈఈ పరీక్ష సాధారణంగా 3 గంటల పాటు ఉంటుంది. అయితే పీడబ్ల్యూడీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మరో గంట అదనంగా, అంటే మొత్తం 4 గంటల సమయం లభించనుంది. దీన్ని ఎన్టీఏ 'కాంపెన్సేటరీ టైమ్'గా పిలుస్తోంది. స్క్రైబ్స్, అదనపు సమయం గురించి చాలా కాలంగా సందేహాలు వెల్లువెతుతున్న సమయంలో ఎన్టీఏ ఈ ప్రకటనను వెలువడించింది.
"ప్రస్తుతం ఉన్న ఎక్స్ట్రా- అడిషనల్ టైమ్ అన్న పదాన్ని కాంపెన్సేటరీ టైమ్‌గా మార్చాలి. గైడ్‌లైన్స్ 4 కింద స్క్రైబ్ వెసులుబాటు పొందేందుకు అర్హత ఉండే అభ్యర్థులకు కచ్చితంగా 1 గంట (3 గంటల పరీక్షా సమయానికి) కాంపెన్సేటరీ టైమ్ ఇవ్వాలి. అదే ఒక పరీక్షకి గంట కన్నా తక్కువ వ్యవధి ఉంటే ప్రో-రాటా ఆధారంగా అదనపు సమయాన్ని కేటాయించాలి. 5 నిమిషాలు లేదా 5 మల్టిపుల్స్‌లో సమయం ఇవ్వాలి," అని ఎన్టీఏ అధికారిక ప్రకటనలో ఉంది.
ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునేందు ఎన్టీఏ నోటిఫికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరోవైపు జేఈఈ 2025 పరీక్ష తేదీని ఎన్టీఏ ఇంకా ప్రకటించలేదు. జేఈఈ అభ్యర్థులు ఈ విషయంపై ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే జేఈఈ డేట్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 ప్రశ్నపత్రాల్లో కీలక మార్పులు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవలే ప్రకటించింది. సెక్షన్ బీలో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని ప్రకటించింది. ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్, పేపర్-1), ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (బీఆర్క్/బీప్లానింగ్, పేపర్-2) పరీక్షలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ అదనపు ప్రశ్నల పాటర్న్‌ని 2021లో, కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రవేశపెట్టారు. వివిధ అకాడమిక్ సవాళ్లను పరిష్కరించేందుకు వీటిని తీసుకొచ్చారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష చివరి మూడు ఎడిషన్లలో సెక్షన్ ఏలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి 20 చొప్పున, సెక్షన్ బీలోని మూడు సబ్జెక్టుల నుంచి 10 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం