JEE Main Exam 2023: జేఈఈ మెయిన్ కరెక్షన్ విండో ఓపెన్; రెండు రోజులే ఈ అవకాశం-jee main exam 2023 nta allows candidates to modify their category notice here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Main Exam 2023 ; Nta Allows Candidates To Modify Their Category. Notice Here

JEE Main Exam 2023: జేఈఈ మెయిన్ కరెక్షన్ విండో ఓపెన్; రెండు రోజులే ఈ అవకాశం

HT Telugu Desk HT Telugu
Apr 21, 2023 03:52 PM IST

JEE Main Exam 2023: 2023 జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షకు సంబంధించిన కరెక్షన్ విండో (correction window) ను ఎన్ టీఏ (NTA) శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT FIle)

JEE Main Exam 2023: 2023 జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షకు సంబంధించిన కరెక్షన్ విండో (correction window) ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. 2023 జేఈఈ మెయిన్ (JEE Main) రాస్తున్న విద్యార్థులకు ఈ కరెక్షన్ విండో (correction window) రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Main Exam 2023: ఏం మార్చుకోవచ్చు..

ఎన్టీఏ (NTA) అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో ఈ కరెక్షన్ విండో (correction window) ఏప్రిల్ 21, ఏప్రిల్ 22 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు ఈ విండో ద్వారా తమ కేటగిరీని మార్చుకోవచ్చు. కేటగిరీ ఆప్షన్ ను మార్చుకోవాలనుకునే విద్యార్థులు ఎన్టీఏ (NTA) అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లోని ఈ కరెక్షన్ విండో (correction window) ద్వారా తమ కేటగిరీని మార్చుకోవచ్చు. ఇప్పటికే సబ్మిట్ చేసిన ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ లో ఈ కరెక్షన్ విండో (correction window) ద్వారా ఏప్రిల్ 21, 22 తేదీల్లో తమ కేటగిరీలో విద్యార్థులు మార్పులు చేసుకోవచ్చు. ఈ విండో ఏప్రిల్ 22వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు.

JEE Main Exam 2023: కౌన్సెలింగ్ సమయంలో వెరిఫికేషన్

విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ (NTA) వెల్లడించింది. అయితే, విద్యార్థుల కేటగిరీకి సంబంధించిన ధ్రువ పత్రాలను కౌన్సెలింగ్ సమయంలో వెరిఫై చేస్తామని వెల్లడించింది. మరోవైపు, జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్ 2 ఆన్సర్ కీపై ఏవైనా అభ్యంతరాలుంటే, వాటిని తెలియజేయడానికి ఏప్రిల్ 21వ తేదీనే లాస్ట్ డేట్. ఏప్రిల్ 21 సాయంత్రం 5 గంటల లోపు విద్యార్థులు జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఆన్సర్ కీపై అభ్యంతరాలను jeemain.nta.nic.in వెబ్ సైట్ ద్వారా వెల్లడించవచ్చు.

IPL_Entry_Point

టాపిక్