JEE Main 2025 : జేఈఈ అభ్యర్థులకు అలర్ట్- క్వశ్చన్ పేపర్ పాటర్న్‌లో కీలక మార్పులు..
JEE main optional questions : జేఈఈ మెయిన్ 2025 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారికి కీలక సమాచారం. వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రం పాటర్న్‌లో కొన్ని మార్పులు కనిపించనున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కీలక అలర్ట్! జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 ప్రశ్నపత్రాల్లో కీలక మార్పులు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). సెక్షన్ బీలో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని ప్రకటించింది. ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్, పేపర్-1), ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (బీఆర్క్/బీప్లానింగ్, పేపర్-2) పరీక్షలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
జేఈఈ మెయిన్ 2025 ప్రశ్నపత్రంలో మార్పులు..
జేఈఈ మెయిన్ 2025 కోసం అధికారిక వెబ్సైట్ jeemain.nta.ac.in ఉందని, తగిన సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎన్టీఏ పునరుద్ఘటించింది.
ఈ అదనపు ప్రశ్నల పాటర్న్‌ని 2021లో, కొవిడ సంక్షోభం నేపథ్యంలో ప్రవేశపెట్టారు. వివిధ అకాడమిక్ సవాళ్లను పరిష్కరించేందుకు వీటిని తీసుకొచ్చారు.
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష చివరి మూడు ఎడిషన్లలో సెక్షన్ ఏలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి 20 చొప్పున, సెక్షన్ బీలోని మూడు సబ్జెక్టుల నుంచి 10 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు వచ్చాయి.
2025లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 25 చొప్పున ప్రశ్నలు ఉండే జేఈఈ మెయిన్స్ పాత పద్ధతినే ఎన్టీఏ అనుసరించనుంది.
ఇదీ చూడండి:- Education in Canada : స్టూడెంట్ పర్మిట్‌ని భారీగా తగ్గించిన కెనడా! భారతీయ విద్యార్థులకు ఇక కష్టమేనా?
“కోవిడ్-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 05 మే 2023 న ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ముగింపుగా ప్రకటించినప్పటి నుంచి, ప్రశ్నల ఆప్షనల్ సెలక్షన్‌ని నిలిపివేయాలని నిర్ణయించారు. పరీక్ష నిర్మాణం దాని అసలు ఫార్మాట్‌కి తిరిగి వస్తుంది. ఇక్కడ సెక్షన్ బీలో ప్రతి సబ్జెక్టుకు 5 (ఐదు) ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. అభ్యర్థులు పేపర్ 1 (బీఈ / బీటెక్), పేపర్ 2 ఏ (బీఆర్క్), పేపర్ 2 బీ (బీ-ప్లానింగ్) కోసం జేఈఈ (మెయిన్) 2025లో ఎటువంటి ఆప్షన్స్ లేకుండా మొత్తం 5 (ఐదు) ప్రశ్నలను ప్రయత్నించాల్సి ఉంటుంది,” అని ఎన్టీఏ నోటిఫికేషన్లో పేర్కొంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇతర సాంకేతిక సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి జేఈఈ మెయిన్ 2025ను రెండుసార్లు నిర్వహిస్తారు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ డ్కు స్క్రీనింగ్ టెస్ట్‌గా ఇది ఉపయోగపడుతుంది.
తాజా అప్డేట్స్ కోసం జేఈఈ అభ్యర్థులు క్రమం తప్పకుండా ఎన్టీఏ వెబ్సైట్లను చెక్ చేస్తూ ఉండాలి.
దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు?
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్‌ను నవంబర్‌లో ప్రకటించే అవకాశం ఉంది.
త రెండేళ్లుగా జనవరి 24వ తేదీ నుంచి తొలి విడత పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా జనవరి 24 నుంచే పరీక్షలు మొదలుకావొచ్చని తెలుస్తోంది. సీబీఎస్‌ఈ పరీక్షలు కూడా గత రెండేళ్ల నుంచి ఫిబ్రవరి 15న ప్రారంభమవుతున్నాయి. అందువల్ల ఆ పరీక్షలకు కూడా సన్నద్ధం అయ్యేందుకు వీలుగా.. జేఈఈ మెయిన్ మొదటి విడత తేదీలను ఖరారు చేయనున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం