JEE Main 2024 syllabus: సబ్జెక్టుల వారీగా జేఈఈ మెయిన్ 2024 సిలబస్ ను ఇక్కడ చూడండి..-jee main 2024 syllabus and dates announced check it now ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Main 2024 Syllabus And Dates Announced, Check It Now

JEE Main 2024 syllabus: సబ్జెక్టుల వారీగా జేఈఈ మెయిన్ 2024 సిలబస్ ను ఇక్కడ చూడండి..

HT Telugu Desk HT Telugu
Nov 02, 2023 04:29 PM IST

JEE Main 2024 syllabus: జేఈఈ మెయిన్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ లో ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ nta.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Mourya/ Hindustan Times)

JEE Main 2024 syllabus: జేఈఈ మెయిన్ 2024 నోటిఫికేషన్ తో పాటు పరీక్ష సిలబస్ ను కూడా ఎన్టీఏ ప్రకటించింది. ఆ వివరాలను వెబ్ సైట్ లో చూడవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

లాస్ట్ డేట్

జేఈఈ మెయిన్ 2024 కి అప్లై చేయడానికి ఆఖరు తేదీ నవంబర్ 30. జేఈఈ మెయిన్ 2024 పరీక్ష రెండు సెషన్స్ లో జరుగుతుంది. తొలి సెషన్ 2024 జనవరిలో, రెండో సెషన్ 2024 ఏప్రిల్ లో జరుగుతుంది. జేఈఈ మెయిన్ 2024 పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హతగా జేఈఈ మెయిన్ లో సాధించిన ఉత్తీర్ణతనే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్ పేపర్ 1 స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న నిట్, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో బీఈ లేదా బీ టెక్ ల్లో అడ్మిషన్ లభిస్తుంది. అలాగే, పేపర్ 2 ద్వారా బీ ఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో అడ్మిషన్ లభిస్తుంది.

సిలబస్ కూడా..

జేఈఈ మెయిన్ 2024 నోటిఫికేషన్ తో పాటు పరీక్ష సిలబస్ ను కూడా ఎన్టీఏ ప్రకటించింది. సిలబస్ లో స్వల్ప మార్పులు చేసింది. నీట్ యూజీ తరహాలోనే కొన్ని చాప్టర్లను సిలబస్ నుంచి తొలగించింది. జేఈఈ మెయిన్ 2024 పరీక్షను హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ సహా 13 భాషల్లో నిర్వహిస్తారు.

పరీక్ష ఎప్పుడు?

జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) తొలి సెషన్ 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య జరుగుతుంది. ఆ తరువాత, రెండో సెషన్ 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీల మధ్య జరుగుతుంది. జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) పరీక్ష రాయాలనుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి వయో పరిమితి నిబంధనలు లేవు. 2021 లేదా 2022 లో క్లాస్ 12, లేదా ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం పాస్ అయిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. అలాగే, 2024 మార్చిలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే.

పరీక్ష పేపర్

జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) ప్రశ్నాపత్రం గత సంవత్సరాల ప్రశ్నాపత్రం తరహాలోనే ఉంటుంది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్నల్ చాయిస్ లతో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఒక్కో పేపర్ లో రెండు సెక్షన్లలో మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. జేఈఈ మెయిన్ 2024 పరీక్ష ద్వారా ప్రఖ్యాత విద్యా సంస్థల్లో బీఈ, బీటెక్, బీ ఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

ఇలా అప్లై చేయండి..

ముందుగా అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. ను ఓపెన్ చేయండి.

హోం పేజీలో కనిపించే JEE Main 2024 session 1 registration లింక్ పై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేషన్ వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

ఆ తరువాత, మీ అకౌంట్ లోకి లాగిన్ కావాలి.

అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫామ్ ను సబ్మిట్ చేయాలి.

భవిష్యత్ అవసరాల కోసం సాఫ్ట్ కాపీని, హార్డ్ కాపీని భద్ర పర్చుకోవాలి.

జేఈఈ మెయిన్ 2024 సిలబస్

ఎన్టీఏ గురువారం విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2024 సిలబస్ ఇలా ఉంది.

Mathematics: గణితం

SETS, RELATIONS, AND FUNCTIONSINTEGRAL CALCULUS
COMPLEX NUMBERS AND QUADRATIC EQUATIONSDIFFRENTIAL EQUATIONS
MATRICES AND DETERMINANTSCO-ORDINATE GEOMETRY
PERMUTATIONS AND COMBINATIONSTHREE DIMENSIONAL GEOMETRY
BINOMIAL THEOREM AND ITS SIMPLE APPLICATIONSVECTOR ALGEBRA
SEQUENCE AND SERIESSTATISTICS AND PROBABILITY
LIMIT, CONTINUITY, AND DIFFERENTIABILITYTRIGONOMETRY                                                           

Physics: ఫిజిక్స్

PHYSICS AND MEASUREMENTELECTROSTATICS
KINEMATICSCURRENT ELECTRICITY
LAWS OF MOTIONMAGNETIC EFFECTS OF CURRENT AND MAGNETISM
WORK, ENERGY, AND POWERELECTROMAGNETIC INDUCTION AND ALTERNATING CURRENTS
ROTATIONAL MOTIONELECTROMAGNETIC WAVES
GRAVITATIONOPTICS
PROPERTIES OF SOLIDS AND LIQUIDS                                        DUAL NATURE OF MATTER AND RADIATION
THERMODYNAMICSATOMS AND NUCLEI
KINETIC THEORY OF GASESELECTRONIC DEVICES
OSCILLATIONS AND WAVESEXPERIMENTAL SKILLS

Physical Chemistry: ఫిజికల్ కెమిస్ట్రీ

SOME BASIC CONCEPTS IN CHEMISTRYSOLUTIONS
ATOMIC STRUCTUREEQUILIBRIUM
CHEMICAL BONDING AND MOLECULAR STRUCTUREREDOX REACTIONS AND ELECTROCHEMISTRY
CHEMICAL THERMODYNAMICSCHEMICAL KINETICS

Inorganic Chemistry: ఇనార్గానిక్ కెమిస్ట్రీ

CLASSIFICATION OF ELEMENTS AND PERIODICITY IN PROPERTIESD - and F- BLOCK ELEMENTS                                               
P- BLOCK ELEMENTSCO-ORDINATION COMPOUNDS

Organic Chemistry: ఆర్గానిక్ కెమిస్ట్రీ

PURIFICATION AND CHARACTERISATION OF ORGANIC COMPOUNDSORGANIC COMPOUNDS CONTAINING OXYGEN
SOME BASIC PRINCIPLES OF ORGANIC CHEMISTRYORGANIC COMPOUNDS CONTAINING NITROGEN
HYDROCARBONSBIOMOLECULES
ORGANIC COMPOUNDS CONTAINING HALOGENSPRINCIPLES RELATED TO PRACTICAL CHEMISTRY                      

WhatsApp channel