JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 రిజిస్ట్రేషన్ కు రేపే లాస్ట్ డేట్; వెంటనే అప్లై చేయండి-jee main 2024 registration process for session 1 ends tomorrow ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Main 2024: Registration Process For Session 1 Ends Tomorrow

JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 రిజిస్ట్రేషన్ కు రేపే లాస్ట్ డేట్; వెంటనే అప్లై చేయండి

HT Telugu Desk HT Telugu
Dec 03, 2023 02:57 PM IST

JEE Main 2024: జేఈఈ మెయిన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ 4వ తేదీ లాస్ట్ డేట్. ఇప్పటికీ అప్లై చేయని విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2024: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 సెషన్ 1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 4 అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

డిసెంబర్ 6 నుంచి కరెక్షన్స్

డిసెంబర్ 4 వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ ఫామ్ లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే jeemain.nta.ac వెబ్ సైట్ లో కరెక్షన్ విండో డిసెంబర్ 6వ తేదీన ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 8 వ తేదీ వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ జనవరి రెండవ వారంలో విడుదల అవుతాయి. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 అడ్మిట్ కార్డ్స్ ను ఎగ్జామ్ డేట్ కు మూడు రోజుల ముందు విడుదల చేస్తారు. JEE మెయిన్స్ సెషన్ 1 పరీక్షను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహిస్తారు.

how to register: ఇలా అప్లై చేయండి..

  • జేఈఈ మెయిన్ సెషన్ 1 కు అప్లై చేయాలనుకునే విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవుతూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ముందుగా JEE మెయిన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న JEE మెయిన్ 2024 సెషన్ 1 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • తరువాత మీ రిజిస్టర్డ్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి.
  • అక్కడ కనిపించే దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
  • ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోండి.
  • అదనపు సమాచారం కోసం విద్యార్థులు NTA హెల్ప్ డెస్క్‌ నంబర్ 011-40759000/ 011- 6922770 లకు కాల్ చేయవచ్చు. లేదా jeemain@nta.ac.in. కు మెయిల్ చేయవచ్చు.
  • Direct link to apply

WhatsApp channel