JEE Main 2024 correction window: జేఈఈ మెయిన్ కరెక్షన్ విండో ఓపెన్; చెక్ చేసుకోండి; రేపటి వరకే చాన్స్..
JEE Main 2024 correction window: జేఈఈ మెయిన్ 2024 కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే, వారికి రేపటి వరకు మాత్రమే అవకాశం ఉంది. jeemain.nta.ac.in కు లాగిన్ అయి కరెక్షన్స్ చేసుకోవచ్చు.
JEE Main 2024 correction window: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 సెషన్ 1 అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్ విండో ఓపెన్ అయింది. తమ అప్లికేషన్‌లలో మార్పులు చేసుకోవాలనుకునే విద్యార్థులు jeemain.nta.ac.inకి లాగిన్ చేసి అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ఈ కరెక్షన్ విండో డిసెంబర్ 8, రాత్రి 11:50. గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. “జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్ష కోసం అప్లై చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://jeemain.nta.ac.in ను సందర్శించి, వారి వివరాలను సరి చూసుకోవాలని ఎన్టీఏ (NTA) సూచించింది. అవసరమైతే, వారి దరఖాస్తు ఫారమ్‌లోని వివరాలలో మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. డిసెంబర్ 8, రాత్రి 11:50. గంటల తరువాత ఈ అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అదనపు ఫీజు ఏదైనా చెల్లించాల్సి ఉంటే, ఆన్ లైన్ లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ల ద్వారా చేసుకోవచ్చని వివరించింది.
జనవరి లో పరీక్ష
JEE మెయిన్ 2024 సెషన్ 1 పరీక్ష జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరుగుతుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITలు, ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఈ పరీక్ష IIT JEE అడ్వాన్స్‌డ్ పరీక్షకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది.