JEE Advanced 2023 Result : రేపే జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు.. ఇలా చెక్​ చేసుకోండి!-jee advanced 2023 result to release on june 18 see how to check ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Advanced 2023 Result : రేపే జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు.. ఇలా చెక్​ చేసుకోండి!

JEE Advanced 2023 Result : రేపే జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు.. ఇలా చెక్​ చేసుకోండి!

Sharath Chitturi HT Telugu
Jun 17, 2023 06:18 AM IST

JEE Advanced 2023 Result : ఆదివారం జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. ఆ వివరాలు..

రేపే జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు.. ఇలా చెక్​ చేసుకోండి!
రేపే జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు.. ఇలా చెక్​ చేసుకోండి!

JEE Advanced 2023 Result : జేఈఈ అడ్వాన్స్​డ్​ 2023 పరీక్ష ఫలితాలు రేపు (ఆదివారం) వెలువడనున్నాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. తమ ఫలితాలను jeeadv.ac.in లో చెక్​ చేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్షను ఈ నెల 4న నిర్వహించింది ఐఐటీ గువాహటి. ఉదయం 9- మధ్యాహ్నం 12 మధ్యలో పేపర్​ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్​ 2 పరీక్షలు జరిగాయి. జూన్​ 9న రెస్పాన్స్​ షీట్​.. అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులోకి వచ్చింది. ఇక జూన్​ 11న ఆన్సర్​ కీ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అవి ఆదివారం వెలువడనున్నాయి.

మీ ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష ఫలితాల కోసం అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో కనిపించే జేఈఈ అడ్వాన్స్​డ్​ 2023 రిజల్ట్​ లింక్​పై క్లిక్​ చేయండి.

ఇదీ చూడండి:- JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్సర్ కీ ని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

స్టెప్​ 3:- మీ లాగిన్​ వివరాలు సమర్పించండి.

స్టెప్​ 4:- ఫలితాలు స్క్రీన్​పై డిస్​ప్లే అవుతాయి.

స్టెప్​ 5:- వాటిని చెక్​ చేసుకుని, డౌన్​లోడ్​ చేసుకోండి.

రిజల్ట్స్​తో పాటు ఫైనల్​ ఆన్సర్​ కీని సైతం ఐఐటీ గువాహటి విడుదల చేయనుంది. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్​సైట్​ను చెక్​ చేయాల్సి ఉంటుంది.

360 మార్కులు..

ఈ దఫా అడ్వాన్స్​డ్​ పరీక్షలో అప్లికేషన్​ దాఖలు చేసుకున్న 95శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం మీద 1,80,226మంది రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. పేపర్​ 1, పేపర్​ 2 స్కోర్స్​ ఆధారంగా ఫైనల్​ రిజల్ట్​ ఉంటుంది. మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

గరిష్ఠ మార్కులు:- 360 (ప్రతి పేపర్​కు 180)

ఫిజిక్స్​ గరిష్ఠ మార్కులు:- 120 (ప్రతి పేపర్​కు 60)

కెమిస్ట్రీ గరిష్ఠ మార్కులు:- 120 (ప్రతి పేపర్​కు 60)

మాథ్స్​ గరిష్ఠ మార్కులు:- 120 (ప్రతి పేపర్​కు 60)

Whats_app_banner

సంబంధిత కథనం