Jazeera airlines flights to Bengaluru: బెంగళూరుకు జజీరా ఎయిర్ లైన్స్ విమాన సేవలు-jazeera airways launches direct flights to bengaluru ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jazeera Airways Launches Direct Flights To Bengaluru

Jazeera airlines flights to Bengaluru: బెంగళూరుకు జజీరా ఎయిర్ లైన్స్ విమాన సేవలు

HT Telugu Desk HT Telugu
Nov 01, 2022 08:04 PM IST

Jazeera airlines flights to Bengaluru: కువైట్ కు చెందిన బడ్జెట్ క్యారియర్ ‘జజీరా ఎయిర్ లైన్స్(Jazeera airlines)’ త్వరలో బెంగళూరుకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్ ను ప్రారంభిస్తోంది.

జజీరా ఎయిర్ లైన్స్ విమానం
జజీరా ఎయిర్ లైన్స్ విమానం (PTI)

Jazeera airlines flights to Bengaluru: జజీరా ఎయిర్ లైన్స్(Jazeera airlines) కువైట్ కు చెందిన ప్రముఖ ‘లోకాస్ట్’ విమానయాన సంస్థ. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఈ బడ్జెట్ ఎయిర్ లైన్స్ విమానయాన సేవలును అందిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Jazeera airlines flights to Bengaluru: గురువారం నుంచి బెంగళూరుకు

కువైట్ నుంచి బెంగళూరుకు డైరెక్ట్ విమాన సేవలను ప్రారంభిస్తున్నట్లు Jazeera airlines మంగళవారం ప్రకటించింది. నవంబర్ 3 నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ప్రతీ వారం గురు, శనివారాల్లో కువైట్ నుంచి బెంగళూరుకు డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుందని తెలిపింది. దీనికి రూ. 19999 టికెట్ ధరగా నిర్ణయించింది.

Jazeera airlines flights to Bengaluru: హైదరాబాద్ కు..

భారత్ కు Jazeera airlines విమాన సేవలు 2017 అక్టోబర్ లోనే ప్రారంభమయ్యాయి. మొదట కువైట్ నుంచి హైదరాబాద్ కు ఈ సేవలను ప్రారంభించింది. అనంతరం, ఇప్పటివరకు భారత్ లోని ఎనిమిది నగరాలకు ఈ సేవలను విస్తరించింది. భారత్, కువైట్ ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు భారత్ లోని అన్ని ప్రధాన నగరాలకు తమ విమాన సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నామని Jazeera airlines దక్షిణాసియా ప్రాంత రీజనల్ మేనేజర్ రొమనాపార్వి తెలిపారు.

IPL_Entry_Point