NVS Class 6 Admission 2023: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు: పూర్తి వివరాలు-jawahar navodaya vidyalaya class 6 admission registration deadline extended full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nvs Class 6 Admission 2023: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు: పూర్తి వివరాలు

NVS Class 6 Admission 2023: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు: పూర్తి వివరాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Updated Jan 31, 2023 11:33 AM IST

Navodaya Vidyalaya Class 6 Admission 2023: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్‍ల కోసం దరఖాస్తు గడువును ఎన్‍వీఎస్ (NVS) పొడిగించింది. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్, దరఖాస్తు ప్రక్రియ, ఎగ్జామ్ డేట్ వివరాలు ఇవే.

NVS Class 6 Admission 2023: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు: పూర్తి వివరాలు
NVS Class 6 Admission 2023: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు: పూర్తి వివరాలు

Navodaya Vidyalaya Admission Registration 2023: జవహర్ నవోదయ విద్యాలయాల్లో (Jawahar Navodaya Vidyalaya - JNV) 6వ తరగతి అడ్మిషన్ల కోసం ఆన్‍లైన్ దరఖాస్తు గడువు పెరిగింది. తుది గడువును పొడిగిస్తూ నవోదయ విద్యాలయ సమితి (NVS) నిర్ణయం తీసుకుంది. నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల (JNV 6th class admission) కోసం ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. నవోదయ అధికారిక వెబ్‍సైట్‍లో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Navodaya Vidyalaya Admission Registration 2023: జవహర్ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ సాధించాలంటే.. దరఖాస్తు తర్వాత విద్యార్థులు ఓ పరీక్ష రాయాలి. 2023-24 విద్యా సంవత్సరానికి నవోదయాల్లో 6వ తరగతి అడ్మిషన్ కోసం ఏప్రిల్ 29న టెస్టు (JNVST) జరుగుతుంది. ఇందుకోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జనవరి 31వ తేదీ లాస్ట్ డేట్‍గా ఉండేది. అయితే ఈ దరఖాస్తు గడువును ఎన్‍వీఎస్ తాజాగా ఫిబ్రవరి 8వ తేదీ వరకు పొడిగించింది.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..

  • Navodaya Vidyalaya Class 6 Admission Registration: నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‍సైట్ navodaya.gov.in లోకి వెళ్లాలి.
  • వెబ్‍సైట్ ఓపెన్ చేయగానే ఎన్‍వీఎస్ క్లాస్ VI రిజిస్ట్రేషన్ లింక్ (JNV Class VI Admission Link) కనిపిస్తుంది. గడువు పొడిగించినట్టు ఓ మెసేజ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ క్లాస్ VI రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్‍పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి.
  • అప్లికేషన్‍లో వివరాలు నమోదు చేయడం పూర్తయ్యాక ఫీజు చెల్లించాలి. అనంతరం సబ్మిట్ చేయాలి.
  • అప్లికేషన్‍ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ ఇదే

Navodaya Vidyalaya Class 6 Admission Registration: 2022-23 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో ప్రస్తుతం 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే 2011 మే 1వ తేదీ నుంచి 2013 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.

నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని పత్రాలు అప్‍లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థి ఫొటో, సంతకం, పేరెంట్ సంతకం, ఆధార్ కార్డు లేదా ఇతర వేరే ఐడీ కార్డు, హెడ్‍మాస్టర్, పేరెంట్ సంతకం చేసిన సర్టిఫికేట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. దరఖాస్తు కోసం ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. హెడ్‍మాస్టర్‌తో సంతకం చేయించాల్సిన సర్టిఫికేట్ ఫార్మాట్ నవోదయ వెబ్‍సైట్‍ ద్వారానే డౌన్‍లోడ్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.