Jammu Kashmir terror attack : సైన్యంపై ఉగ్రదాడి.. ముమ్మరంగా దర్యాప్తు- రంగంలోకి ఎన్​ఐఏ-jammu kashmir terror attack nia team to visit site hunt for terrorists in on ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jammu Kashmir Terror Attack : Nia Team To Visit Site Hunt For Terrorists In On

Jammu Kashmir terror attack : సైన్యంపై ఉగ్రదాడి.. ముమ్మరంగా దర్యాప్తు- రంగంలోకి ఎన్​ఐఏ

Sharath Chitturi HT Telugu
Apr 21, 2023 12:06 PM IST

Jammu Kashmir terror attack : ఐదుగురు సైనికుల మరణానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. గురువారం ట్రక్​పై జరిగిన ఉగ్రదాడిలో ఈ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

సైనికుల ట్రక్​పై దాడి జరిగిన ప్రాంతం
సైనికుల ట్రక్​పై దాడి జరిగిన ప్రాంతం (via REUTERS)

Jammu Kashmir terror attack : జమ్ముకశ్మీర్​ ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సైనికుల ట్రక్​పై దాడి జరిపి, ఐదుగురి ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అధికారులు అనేక ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఎన్​ఐఏ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది..?

ఉగ్రవాదుల ఏరివేత కార్యకలాపాల కోసం మోహరించిన సైనికుల బృందం గురువారం మధ్యాహ్నం పూంచ్​ నుంచి బయలుదేరింది. ఈ సైనికులందరు.. రాష్ట్రీయ రైఫిల్స్​ యూనిట్​కు చెందిన వారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న ట్రక్​కు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఐదుగురిలో నలుగురు పంజాబ్​కు చెందిన వారే ఉన్నారు.

Terror attack in Jammu Kashmir : తొలుత.. ఇది ట్రక్​కు జరిగిన ప్రమాదమని అందరు భావించారు. కానీ ఇదొక ఉగ్రదాడి అని తేలింది. ట్రక్​పై 25కుపైగా బుల్లెట్​లు ఉన్నాయి. దీని బట్టి.. ట్రక్​కు నలువైపుల నుంచి దాడి జరిగినట్టు స్పష్టమైంది. అనేకమంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

ఉగ్రవాదుల ఏరివేత..

ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎన్​ఐఏ (నేషనల్​ ఇన్​వెస్టిగేషన్​ ఏజెన్సీ) కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎన్​ఐఏ బృందం.. ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నట్టు సమాచారం.

Soldiers killed in terror attack : మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఉగ్రవాదులు తప్పించుకోలేకుండే.. ప్రణాళికలు రచించారు.

సైనికులపై ఉగ్రదాడి ఘటనను రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో పాటు వివిధ పార్టీల నేతలు ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. సైనికుల మరణవార్త తమకు ఎంతో బాధకలిగించిందని వివరించారు.

పాక్​ మంత్రి వస్తారా?

Bilawal Bhutto India visit : ఎస్​సీఓ (షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్​) సదస్సులో పాల్గొనేందుకు.. ఇండియాకు రావాలని పాకిస్థాన్​ విదేశాంగమంత్రి బిలావల్​ భుట్టో నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై గురువారం ప్రకటన వెలువడింది. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే జమ్ముకశ్మీర్​లో సైనికులపై ఉగ్రదాడి జరిగింది. ఈ నేపథ్యంలో.. బిలావల్​ భుట్టో భారత్​ పర్యటన ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక వేళ ఆయన ఇండియాకు వస్తే.. ఓ పాక్​ విదేశాంగ మంత్రి ఇండియాలో పర్యటించడం, 2011 తర్వాత ఇదే తొలిసారి అవుతుంది!

IPL_Entry_Point

సంబంధిత కథనం