ISRO YUVIKA: ఇస్రో ‘యువిక’ ఫలితాల వెల్లడి; యంగ్ సైంటిస్ట్ ల ఫస్ట్ లిస్ట్ ఇదే..-isro yuvika result 2023 announced check first selection list ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Isro Yuvika Result 2023 Announced, Check First Selection List

ISRO YUVIKA: ఇస్రో ‘యువిక’ ఫలితాల వెల్లడి; యంగ్ సైంటిస్ట్ ల ఫస్ట్ లిస్ట్ ఇదే..

HT Telugu Desk HT Telugu
Apr 11, 2023 04:02 PM IST

ISRO YUVIKA: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (Indian Space Research Organisation ISRO) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యువిక ప్రొగ్రామ్ సంబంధించి కీలక అప్ డేట్ వెలువడింది.

ISRO YUVIKA result 2023 announced on isro.gov.in, check first selection list
ISRO YUVIKA result 2023 announced on isro.gov.in, check first selection list (Getty Images/iStockphoto)

ISRO YUVIKA: యువిక ప్రొగ్రామ్ కోసం యువ శాస్త్రవేత్తల తొలి జాబితాను ఇస్రో ప్రకటించింది. పాఠశాల విద్యార్థుల్లో అంతరిక్ష శాస్త్రం, అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచే లక్ష్యంతో ఇస్రో (ISRO) యువ విజ్ఞాని కార్యక్రమ్ ‘యువిక’ (Yuva Vigyani Karyakram, YUVIKA 2023) ను ప్రారంభించింది. ఇందుకు గానూ ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానించింది. ఆ దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి తొలి యువిక (YUVIKA) జాబితాను రూపొందించింది.

ట్రెండింగ్ వార్తలు

ISRO YUVIKA: మొత్తం 350 మంది..

పాఠశాల విద్యార్థుల కోసం ఇస్రో (ISRO) రూపొందించిన యంగ్ సైంటిస్ట్ ప్రొగ్రామ్ లో భాగంగా తొలి జాబితాను విడుదల చేసింది. ఇస్రో వెబ్ సైట్స్ isro.gov.in లేదా jigyasa.iirs.gov.in. లో ఈ జాబితాను అప్ లోడ్ చేసింది. మొత్తం 350 మంది విద్యార్థుల పేర్లతో ఈ లిస్ట్ ను రూపొందించారు. విద్యార్థులు isro.gov.in లేదా jigyasa.iirs.gov.in. వెబ్ సైట్స్ లో ఈ లిస్ట్ ను చెక్ చేసుకోవచ్చు. అలాగే, Yuva Vigyani Karyakram, YUVIKA 2023 కు ఎంపికైన విద్యార్థులకు వ్యక్తిగతంగా ఈ సెలక్షన్ వివరాలను ఈ మెయిల్ ద్వారా పంపించారు. అందువల్ల ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు తమ దరఖాస్తుల్లో పేర్కొన్న ఈ మెయిల్స్ ను వెంటనే చెక్ చేసుకోవడం మంచిది.

ISRO YUVIKA: మూడు రోజుల్లో అంగీకారం తెలపాలి..

ఈ యంగ్ సైంటిస్ట్ (Yuva Vigyani Karyakram, YUVIKA 2023) కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంపికైన విద్యార్థులు మూడు రోజుల్లోగా తమ అంగీకారం తెలియజేయాల్సి ఉంటుంది. మూడు రోజుల్లోగా, అంటే ఏప్రిల్ 13, సాయంత్రం 5.30 గంటలలోగా అంగీకారం తెలియజేయని విద్యార్థుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. అలా ఏర్పడిన ఖాళీలను వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారితో భర్తీ చేస్తూ రెండో జాబితాను (second list) విడుదల చేస్తారు. ఈ రెండో లిస్ట్ ను ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేస్తారు. అలాగే, ఇస్రో (ISRO) ఆధ్వర్యంలో ఈ యంగ్ సైంటిస్ట్ కార్యక్రమం మే నెల 15 నుంచి మే 26 వరకు జరుగుతుంది.

Check the list here.

IPL_Entry_Point

టాపిక్