Shukrayaan 1 : శుక్రయాన్ లాంచ్ తేదీ ఇదే.. ఇస్రో డ్రీమ్ మిషన్‌పై లేటేస్ట్ అప్‌డేట్!-isro shukrayaan 1 venus orbiter mission launching date final know all details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shukrayaan 1 : శుక్రయాన్ లాంచ్ తేదీ ఇదే.. ఇస్రో డ్రీమ్ మిషన్‌పై లేటేస్ట్ అప్‌డేట్!

Shukrayaan 1 : శుక్రయాన్ లాంచ్ తేదీ ఇదే.. ఇస్రో డ్రీమ్ మిషన్‌పై లేటేస్ట్ అప్‌డేట్!

Anand Sai HT Telugu
Oct 01, 2024 06:48 PM IST

ISRO Shukrayaan 1 Mission : చంద్రయాన్ -3 విజయం తరువాత ఇస్రో ఇప్పుడు మిషన్ శుక్రాయాన్ కోసం సన్నాహాలు ముమ్మరం చేసింది. మిషన్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం..

ఇస్రో శుక్రయాన్
ఇస్రో శుక్రయాన్

చంద్రయాన్ -3 విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శుక్ర గ్రహానికి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ మిషన్‌లో వ్యోమనౌక గ్రహాన్ని చేరుకోవడానికి 112 రోజులు పడుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ మిషన్ పేరు వీనస్ ఆర్బిటర్ మిషన్(వీవోఎం). వాహనాన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారో ప్రకటించారు. శుక్రగ్రహంపైకి భారత్ మిషన్ చేయడం ఇదే తొలిసారి. శుక్ర గ్రహంపై పరిస్థితులు, భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఈ మిషన్ కోసం రూ.1,236 కోట్లు (సుమారు 150 మిలియన్ డాలర్లు) భారత ప్రభుత్వం మంజూరు చేసింది.

అన్నీ సవ్యంగా జరిగితే శుక్రయాన్-1ను 2028 మార్చి 29న ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడానికి భారతదేశం చేస్తున్న మొదటి ప్రయత్నం శుక్రయాన్-1. ఇస్రోకు చెందిన శక్తివంతమైన ఎల్వీఎం-3 (లాంచ్ వెహికల్ మార్క్ 3) రాకెట్‌ను ఈ మిషన్‌లో ఉపయోగించనున్నారు. ప్రయోగించిన 112 రోజుల తర్వాత 2028 జూలై 19న ఈ వ్యోమనౌక శుక్రుడి ఉపరితలాన్ని చేరుకుంటుంది. అంతరిక్ష ప్రపంచంలో అందరి దృష్టినికి ఆకర్శిస్తున్న ఇస్రోకు ఇది పెద్ద విజయం కానుంది.

శుక్ర గ్రహం వాతావరణం, ఉపరితలం, భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేయడమే మిషన్ వివోఎమ్ లక్ష్యం. వాతావరణ కూర్పు, ఉపరితల లక్షణాలు, అగ్నిపర్వత లేదా భూకంప కార్యకలాపాలను పరిశోధించడంలాంటి లక్ష్యాలు ఈ మిషన్‌లో ఉన్నాయి. సింథటిక్ అపెర్చర్ రాడార్, ఇన్ఫ్రారెడ్, అతినీలలోహిత కెమెరాలు, సెన్సర్లతో సహా అత్యాధునిక పరికరాలను శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఈ వ్యోమనౌక ఆర్బిటర్‌కు పంపనుంది. శుక్రుడి రహస్యాలను ఛేదించడానికి, గ్రహం ఉపరితలంపై పరిస్థితులను అన్వేషించడానికి ఈ పరికరాలు శాస్త్రవేత్తలకు సహాయపడతాయి.

శుక్రయాన్-1 మిషన్‌లో ఇస్రోతో పాటు రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ వంటి దేశాలు కూడా పాల్గొంటున్నాయి. సూర్యుడు, శుక్రుడి వాతావరణాల నుంచి వచ్చే కణాలను అధ్యయనం చేసేందుకు స్వీడిష్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఫిజిక్స్(ఐఆర్‌ఎఫ్) ఇస్రోకు వీనస్ న్యూట్రల్స్ అనలైజర్ (వీఎన్ఏ) పరికరాన్ని అందించనుంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను మరో అడుగు ముందుకు వేసేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

టాపిక్