ISRO recruitment 2024: ఇస్రోలో సైంటిస్ట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్-isro recruitment 2024 apply for scientist and other posts till feb 12 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Isro Recruitment 2024: ఇస్రోలో సైంటిస్ట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

ISRO recruitment 2024: ఇస్రోలో సైంటిస్ట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Jan 23, 2024 01:55 PM IST

ISRO recruitment 2024: సంస్థలో సైంటిస్ట్ తదితర పోస్ట్ ల భర్తీ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (Indian Space ResearchOrganisation ISRO) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ISRO recruitment 2024: సైంటిస్ట్ సహా పలు ఇతర పోస్టులను భర్తీ చేయడానికి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్ లకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Last date: ఫిబ్రవరి 12వ తేదీ వరకు..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కేంద్రాల్లో ఒకటైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (National Remote Sensing Centre NRSC) లో సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎన్ఆర్ ఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.nrsc.gov.in ద్వారా ఆన్ లైన్ లో ఫిబ్రవరి 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

vacancies: ఖాళీల వివరాలు

ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 41 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీటిలో సైంటిస్ట్ / ఇంజినీర్ 'ఎస్సీ' పోస్ట్ లు 35, మెడికల్ ఆఫీసర్ 'ఎస్సీ పోస్టు' 1, నర్సు 'బి' పోస్ట్ లు 2, లైబ్రరీ అసిస్టెంట్ 'ఎ' పోస్ట్ లు 3 ఉన్నాయి. ఇందులో పోస్ట్ ల వారీగా విద్యార్హతలు, వయోపరిమితులు ఉన్నాయి. పోస్టు కోడ్ 06, 09, 13, 14, 15, 16 పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టు కోడ్ 07, 08, 10, 11, 12 పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టు కోడ్ 17, 18, 19 పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు రూ .250 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. అయితే, అంతకన్నా ముందు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.

How to apply: ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ పోస్ట్ లకు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.

  • ముందుగా ఎన్ఆర్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.nrsc.gov.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపించే "సైంటిస్ట్ ఇంజనీర్ 'ఎస్సీ', మెడికల్ ఆఫీసర్ 'ఎస్సీ', నర్సు 'బి' , లైబ్రరీ అసిస్టెంట్ 'ఎ' పోస్టుల భర్తీ లింక్ పై క్లిక్ చేయండి.
  • స్క్రీన్ పై ఒక కొత్త పేజీ డిస్ ప్లే అవుతుంది.
  • అప్లై లింక్ పై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ ఫారం నింపండి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్ లను అప్ లోడ్ చేయండి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  • అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోండి.
  • డిటైల్డ్ నోటిఫికేషన్ కోసం www.nrsc.gov.in వెబ్ సైట్ ను పరిశీలించండి.