ISRO Recruitment 2024: ఇస్రో రిక్రూట్మెంట్; 103 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
ISRO Recruitment 2024: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మెడికల్ ఆఫీసర్స్, టెక్నికల్ అసిస్టెంట్లతో సహా 103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్ సైట్ isro.gov.in ద్వారా ఆన్ లైన్ లో అక్టోబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ISRO Recruitment 2024: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) 103 పోస్టుల భర్తీకి ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మెడికల్ ఆఫీసర్-ఎస్సీ, మెడికల్ ఆఫీసర్-ఎస్డీ, సైంటిస్ట్ ఇంజినీర్-ఎస్సీ, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్-బీ, డ్రాఫ్ట్స్మన్-బీ, అసిస్టెంట్ (రాజభాష లేదా అధికార భాష) వంటి పోస్టులున్నాయి.
అక్టోబర్ 9 లాస్ట్ డేట్
ఇస్రోలోని ఈ పోస్ట్ లపై ఆసక్తి ఉన్నవారు భారతీయ స్పేస్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ isro.gov.in ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 9. బెంగళూరులో ఇస్రోకు చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) కోసం ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్ లు ప్రస్తుతానికి తాత్కాలికమైనవి. కానీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం నిరవధికంగా కొనసాగవచ్చు.
వేతనం, ఎంపిక విధానం
పైన పేర్కొన్న ఉద్యోగాలకు జాబ్ ప్రొఫైల్ ప్రకారం వేతనం రూ.21,700 నుంచి రూ.2,08,700 వరకు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించి 1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ప్రక్రియ తర్వాత ఎంపికైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కు పిలుస్తారు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ (రాజభాష లేదా అధికార భాష) కు మాత్రం వయోపరిమితి 18 నుంచి 28 ఏళ్లు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి + 5 సంవత్సరాలు, ఒబిసి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి + 3 సంవత్సరాలు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ
1. ముందుగా ఇస్రో (isro) అధికారిక వెబ్ సైట్ http://www.isro.gov.in ను ఓపెన్ చేయండి.
2. హోమ్ పేజీలో ఇస్రో రిక్రూట్మెంట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
3. అప్లికేషన్ ఫామ్ నింపండి.
4. అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
5. అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.
5. మీ అప్లికేషన్ ఫామ్ ను ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోండి.
మరింత సమాచారం కోసం, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ను చూడవచ్చు.