ISRO Recruitment 2023: ఇస్రోలో సైంటిస్ట్, ఇంజినీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్-isro recruitment 2023 apply for 303 scientist engineer posts at isrogovin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Isro Recruitment 2023: Apply For 303 Scientist/ Engineer Posts At Isro.gov.in

ISRO Recruitment 2023: ఇస్రోలో సైంటిస్ట్, ఇంజినీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (File Photo)

ISRO Recruitment 2023: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) లో సైంటిస్ట్, ఇంజినీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో isro.gov.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ISRO Recruitment 2023: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) లో సైంటిస్ట్, ఇంజినీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో isro.gov.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

మొత్తం 303 పోస్ట్ లు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 303 పోస్ట్ లను ఇస్రో భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 25న ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 14. విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల కోసం వెబ్ సైట్ లోని డిటైల్డ్ నోటిఫికేషన్ ను పరిశీలించాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులు దేశవ్యాప్తంగా బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్ కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురంలలోని కేంద్రాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు అడ్మిట్ కార్డ్స్ ను ఈమెయిల్ లో పంపిస్తారు. అభ్యర్థులు ఒక్కో పోస్ట్ కు రూ. 250 చొప్పున అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో, లేదా ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్ లో ఆఫ్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది.

వేకెన్సీ వివరాలు

  • సైంటిస్ట్/ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) - 90
  • సైంటిస్ట్/ఇంజినీర్ (మెకానికల్) - 163
  • సైంటిస్ట్/ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) - 47
  • సైంటిస్ట్/ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ - అటానమస్ బాడీ పీఆర్ఎల్) - 2
  • సైంటిస్ట్/ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్ - అటానమస్ బాడీ పీఆర్ఎల్) - 1

Detailed Notification available here.