Aditya L1 launch : ఆదిత్య ఎల్​1 లాంచ్​ సక్సెస్​.. నింగిలోకి పీఎస్​ఎల్​వీ రాకెట్-isro launches solar mission adityal1 from sriharikota ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aditya L1 Launch : ఆదిత్య ఎల్​1 లాంచ్​ సక్సెస్​.. నింగిలోకి పీఎస్​ఎల్​వీ రాకెట్

Aditya L1 launch : ఆదిత్య ఎల్​1 లాంచ్​ సక్సెస్​.. నింగిలోకి పీఎస్​ఎల్​వీ రాకెట్

Sharath Chitturi HT Telugu

Aditya L1 launch live : ఆదిత్య ఎల్​1 మిషన్​ లాంచ్​ సక్సెస్​ అయ్యింది. శ్రీహరికోట నుంచి పీఎస్​ఎల్​వీ రాకెట్ శనివారం ఉదయం​ నింగిలోకి ఎగిరింది.

ఆదిత్య ఎల్​1 లాంచ్​ సక్సెస్.. (ANI)

Aditya L1 launch : ఆదిత్య ఎల్​1 మిషన్​ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ). ఆదిత్య ఎల్​1ను మోసుకెళుతున్న పీఎస్​ఎల్​వీ రాకెట్​.. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిరింది. వందలాది మంది ఔత్సాహికులు.. శ్రీహరికోటకు తరలివెళ్లి, ఆదిత్య ఎల్​1 లాంచ్​ను లైవ్​లో వీక్షించారు.

ఇస్రో తొలి సౌర ప్రాజెక్ట్​ ఇదే..!

చంద్రయాన్​-3 తర్వాత ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్​.. ఈ ఆదిత్య ఎల్​1. అంతేకాకుండా.. సూర్యుడి గురించి పరిశోధనలకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్​ కూడా ఇదే కావడం ఇవేషం. చంద్రుడిపై సక్సెస్​ఫుల్​గా ల్యాండ్​ అయిన నాలుగో దేశంగా ఇండియాను నిలిపిన ఇస్రో.. నూతన ఉత్తేజంతో ఈ సోలార్​ మిషన్​ లాంచ్​ను పూర్తిచేసింది.

Aditya L1 mission : ఈ ఆదిత్య ఎల్​1.. భూమి నుంచి 1.5 మిలియన్​ కిలోమీటర్లు ప్రయాణించి, లాగ్రేజియన్​ పాయింట్​ 1(ఎల్​1) వద్దకు చేరుకుంటుంది. ఇందుకు దాదాపు 4 నెలల సమయం పడుతుందని ఇస్రో వెల్లడించింది. అయితే ఎల్​1 పాయింట్​కు చేరుకోవడం అంత సులభం కాదు. ఈ టాస్క్​ను పూర్తి చేసేందుకు లిక్విడ్​ అపోజీ మోటార్​ (ఎల్​ఏఎం)ను రూపొందించింది ఇస్రోకు చెందిన లిక్విడ్​ ప్రొపల్షన్​ సిస్టెమ్​ సెంటర్ విభాగం​.

ఈ మిషన్​ ప్రధాన లక్ష్యాలను ఇస్రో ప్రకటించింది. కొరొనల్​ హీటింగ్​, సౌర మంటలు, కొరొనల్​ మాస్​ ఇజెక్షన్స్​, సౌర గాలులు, భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణ వంటి వాటిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుపుతుంది ఆదిత్య ఎల్​-1.

ఇదీ చూడండి:- Chandrayaan-3: చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ మరో కీలక ఆవిష్కరణ; భూమిపై మాదిరిగానే.

ఈ ఆదిత్య ఎల్​1లో 7 పేలోడ్స్​ ఉంటాయి. వీటిల్లో విజిబుల్​ ఎమిషన్​ లైన్​ కొరొనాగ్రఫీ ఒకటి. నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్న అనంతరం.. ఇది భూమికి, రోజుకు 1440 ఇమేజ్​లను పంపిస్తుంది. మొత్తం 7 పేలోడ్స్​లో నాలుగింటింటి సూర్యుడి ఖాంతిని అబ్సర్వ్​ చేసేందుకు వినియోగిస్తోంది ఇస్రో. మరో మూడింటినీ ప్లాస్మా, మాగ్నెటిక్​ ఫీల్డ్స్​ వంటి వాటిపై పరిశోధనల కోసం వాడుతోంది.

ISRO Aditya L1 : ఆదిత్య ఎల్​1 జీవితకాలం ఐదేళ్లని తెలుస్తోంది. అప్పటివరకు భూమికి ఫొటోలు పంపుతూ ఉంటుంది. అయితే.. ఇంధనం ఖర్చు చేసే ఆధారంగా ఇది 5ఏళ్ల కన్నా ఎక్కువ కాలం కూడా పనిచేసే అవకాశం ఉంటుంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.