ఇస్లామిక్ స్టేట్ ఉగ్రనేత అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ మృతి, కొత్త నాయకుడి పేరు ప్రకటన-islamic state names new leader confirms death of abu ibrahim alqurashi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఇస్లామిక్ స్టేట్ ఉగ్రనేత అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ మృతి, కొత్త నాయకుడి పేరు ప్రకటన

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రనేత అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ మృతి, కొత్త నాయకుడి పేరు ప్రకటన

HT Telugu Desk HT Telugu
Published Mar 10, 2022 10:58 PM IST

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన నాయకుడు అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ మరణాన్ని ఐఎస్ గురువారం ఒక ప్రకటనలో ధృవీకరించింది.

<p>Syrian Democratic Forces conduct search for Islamic State militants in Hasaka, Syria January 23, 2022, in this screen grab taken from a video.&nbsp;</p>
Syrian Democratic Forces conduct search for Islamic State militants in Hasaka, Syria January 23, 2022, in this screen grab taken from a video. (REUTERS)

Damascus | ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన నాయకుడు అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ మరణాన్ని ఐఎస్ గురువారం ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఈమేరకు అడిని స్థానంలో అబూ హసన్ అల్-హషేమీ అల్-ఖురాషీ బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించింది.

ఇస్లామిక్ స్టేట్ జిహాదీలు "అబు హసన్ అల్-హషేమీ అల్-ఖురాషిపై విశ్వాసబద్ధంగా ఉంటాం, ముస్లింల ఖలీఫాగా విధేయత చూపుతాం" అని ప్రమాణం చేసినట్లు ఈ ఉగ్రసంస్థకు చెందిన ప్రతినిధి ఒక ఆడియో రికార్డింగ్‌లో తెలిపారు. దీని ప్రకారం ఈ సంస్థ పూర్వ నాయకుడైన అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ మరణం నిజమేనని ధృవీకరణ జరిగింది.

Here's the update:

 సిరియా దేశంలోని వాయువ్య ప్రాంతం ఐఎస్ జిహాదీల నియంత్రణలో ఉంటుంది. అయితే ఉగ్రవాద ఏరివేతలో భాగంగా అమెరికా గత ఫిబ్రవరి నెలలో ఈ ప్రాంతంలో దాడులు నిర్వహించింది. ఆ సమయంలో మిలిటెంట్ గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే అతడు చనిపోయాడా లేదా అనేది అప్పుడు ధృవీకరణ కాలేదు. తాజాగా కొత్త నాయకుడు రావడంతో ఈ విషయంలో స్పష్టత లభించినట్లయింది.

 

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.