క్సలిజం అంతానికి 2026 మార్చి 31వ తేదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయించారు. నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. ఈ వారం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయనపై రూ.1.5 కోట్ల రివార్డు ఉంది. బసవరాజు మావోయిస్టుల టాప్ కమాండర్‌గా ఉన్నారు. ఆయన ఎన్‌కౌంటర్‌లో మరణించినప్పటి నుంచి మావోయిస్టు పార్టీ ప్రత్యామ్నాయం కోసం వెతుకుతోంది. అయితే ఇప్పుడు చర్చలో ఉన్న ప్రముఖుల్లో ఒకరు కూడా లొంగిపోయే అవకాశం ఉంది. ఆయన పేరే ఎం.వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ. ఇప్పుడు కమాండ్ తీసుకోగల నక్సలైట్లలో ఒకరిగా ఆయనను భావించారు.
69 ఏళ్ల సోనూ ఇప్పుడు మునుపటిలా యాక్టివ్‌గా లేరని అంటున్నారు. అంతేకాదు లొంగిపోయి తన భార్య బాటలోనే పునరావాస శిబిరానికి వెళ్లాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రలోని పెద్దపల్లిలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. బీకాం పట్టా పొందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వరకు పలు ప్రాంతాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.
నక్సలైట్ల ఎలైట్ ఫోర్స్‌గా పిలువబడే సి-60కి ఆయన నాయకత్వం వహించారు. కానీ ఇప్పుడు వయసు పెరగడంతోపాటుగా కొన్ని సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సోనూ లొంగిపోతే దేశంలో నక్సలిజాన్ని అంతమొందించే దిశగా ప్రభుత్వానికి అది పెద్ద ముందడుగు అవుతుంది. ఓ వైపు బసవరాజు ఎన్‌కౌంటర్, మరోవైపు సోనూ లొంగిపోవడం భద్రతా దళాలకు పెద్ద విజయమే కానుంది.
సోనూ సోదరుడు ఎంకే రావు అలియాస్ కిషన్ జీ కూడా మావోయిస్టు కమాండర్. 2011లో కోల్‌కతాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. సోనూ భార్య తారక్క మహారాష్ట్ర పోలీసుల ముందు గతంలో లొంగిపోయి ప్రస్తుతం గడ్చిరోలిలోని పునరావాస శిబిరంలో నివసిస్తోంది. పలువురు మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవలే అన్నారు. ఆయన ప్రకటన తర్వాత సోనూ లొంగిపోతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే మరోవైపు ఇంకో ప్రచారం జరుగుతోంది. అబుజ్మడ్ అడవుల్లో సోనూను దాదాపు చుట్టుముట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. లొంగిపోవాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు భద్రతా దళాలు చాలా చురుగ్గా ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
టాపిక్