Is Covishield safe? ‘కొవిషీల్డ్’తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనా? వైద్య వర్గాల్లో చర్చ-is covishield safe doctor s call for vaccine safety review sparks debate ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Is Covishield Safe? Doctor's Call For Vaccine Safety Review Sparks Debate

Is Covishield safe? ‘కొవిషీల్డ్’తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనా? వైద్య వర్గాల్లో చర్చ

Sudarshan Vaddanam HT Telugu
Feb 17, 2023 09:18 PM IST

Is Covishield safe?: కొరోనా (corona) మహమ్మారి ని ఎదుర్కొనేందుకు ముందుగా వచ్చిన టీకాల్లో కొవి షీల్డ్ ఒకటి. ఇండియాలో మెజారిటీ ప్రజలు ఈ టీకానే వేసుకున్నారు. అయితే, తాజాగా ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై చర్చ ప్రారంభమైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Photo)

Is Covishield safe?: కొవిషీల్డ్ (Covishield) సహా కొరొనా టీకాలన్నింటినీ మరోసారి సంపూర్ణంగా పరీక్షించాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. డాక్టర్ అసీమ్ మల్హోత్రా అనే బ్రిటిష్ ఇండియన్ డాక్టర్ ఈ కొవిషీల్డ్ (Covishield) టీకా వల్ల గుండె పోటు, రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు వస్తున్నాయని, దీనివల్ల ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని హెచ్చరించారు. డాక్టర్ మల్హోత్రా వ్యాఖ్యలపై వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కొందరు డాక్టర్ మల్హోత్రా వాదనను సమర్ధిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Is Covishield safe?: గుండె పోటు, రక్తం గడ్డకట్టడం..

కొవిషీల్డ్ (Covishield) కు మళ్లీ ఫుల్ సేఫ్టీ రివ్యూ అవసరమని డాక్టర్ మల్హోత్రా స్పష్టం చేశారు. కొవిషీల్డ్ (Covishield) వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ (side effects) కనిపిస్తున్నాయని పేర్కొంటూ చాలామంది వైద్యులు ఇప్పడు డాక్టర్ మల్హోత్రా వాదనను సమర్ధిస్తున్నారు. మరి కొందరు వైద్యులు మాత్రం.. కొరొనా (corona) విజృంభిస్తున్న సమయంలో కొవిషీల్డ్ (Covishield) సహా పలు వ్యాక్సిన్ (corona vaccines) లు లక్షలాది ప్రాణాలను కాపాడాయని వాదిస్తున్నారు. ఇప్పుడు కొందరు వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ (side effects) అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

mRNA COVID-19: ఎంఆర్ఎన్ఏ కోవిడ్ 19 వ్యాక్సిన్

ఎంఆర్ఎన్ఏ (mRNA COVID-19) ఆధారిత కోవిడ్ 19 (covid 19) వ్యాక్సిన్ లను వినియోగించడం తక్షణమే ఆపేయాలని, కోవిషీల్డ్ (Covishield) తో పాటు ఆక్స్ ఫర్డ్ఆస్ట్రా జెనికా (Oxford-AstraZeneca) కూడా ప్రమాదకరమేనని డాక్టర్ మల్హోత్రా హెచ్చరించారు. ఆక్స్ ఫర్డ్ఆస్ట్రా జెనికా (Oxford-AstraZeneca) తో కూడా గుండె జబ్బులు, స్ట్రోక్స్ (side effects) వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ రెండు టీకాలకు (corona vaccines) ప్రపంచవ్యాప్త అత్యవసర వినియోగానికి అనుమతులను ఇచ్చిన విషయం తెలిసిందే.

Covishield risks: డబుల్ రిస్క్

కొవిషీల్డ్ (Covishield) తో రెండింత ముప్పు ఉందని పుణెలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజీ (DY Patil Medical College) ప్రిన్స్ పాల్ డాక్టర్ అమితవ్ బెనర్జీ (Dr Amitav Banerjee) హెచ్చరించారు. రక్తం గడ్డకట్టే (blood clots) ముప్పు ఉన్నందువల్ల చాలా యూరోపియన్ దేశాలు ఈ కొవిషీల్డ్ (Covishield) ను వినియోగించకూడదని నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఎంఆర్ఎన్ఏ (mRNA) వ్యాక్సిన్లతో మయొకార్డైటిస్ (myocarditis) సమస్య వస్తుంది. Covishield లోని డీఎన్ఏ మన శరీరంలోకి చేరిన తరువాత mRNA గా మారుతుంది’ అని ఆయన వివరించారు. కోవిడ్ 19 (covid 19) వ్యాక్సినేషన్ తరువాత ఆకస్మిక మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ’తక్షణమే మనం కోవిడ్ 19 (covid 19) వ్యాక్సినేషన్ ను ఆపేయాలి. మళ్లీ అన్ని టీకాలకు ఫుల్ సేఫ్టీ రివ్యూ నిర్వహించాలి’ అని ఆయన సూచించారు. ఎయిమ్స్ (AIIMS) ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ కే రాయ్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.

Vaccines are safe: లక్షలాది ప్రాణాలు నిలిచాయి..

మరోవైపు, కొరోనా (corona) వ్యాక్సిన్ల పై దుష్ప్రచారం జరుగుతోందని, ఈ వ్యాక్సిన్ ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ (side effects) చాలా, చాలా అరుదని మరి కొందరు వైద్యులు వాదిస్తున్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ల వల్ల ఒనగూరిన ప్రయోజనాలతో పోలిస్తే, సైడ్ ఎఫెక్ట్స్ (side effects) అంశం చాలా చిన్నదని, కోవిడ్ 19 (covid 19) టీకాల వల్ల లక్షలాది ప్రాణాలు నిలిచాయని ఇంపీరియల్ కాలేజ్, లండన్ (Imperial College London) లో ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్ (experimental medicine) డాక్టర్ పీటర్ ఓపెన్ షా (professor Peter Openshaw) వ్యాఖ్యానించారు. కోవిడ్ 19 (covid 19) నుంచి రక్షణ పొందడానికి టీకాలను మించిన మార్గం లేదని, ఇప్పటికే లక్షలాది ప్రాణాలు ఈ వ్యాక్సిన్ ల వల్ల నిలిచాయని యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ (UK's Medicines and Healthcare products Regulatory Agency) ఆలిసన్ కేవ్ (Alison Cave) వ్యాఖ్యానించారు. టీకాల వల్ల covid 19 మరణాల సంఖ్య తగ్గడంతో పాటు వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గిందని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ పేర్కొంది.

WhatsApp channel

టాపిక్