IOCL recruitment 2023 : ఐఓసీఎల్​లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!-iocl recruitment 2023 apply for non executive posts full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Iocl Recruitment 2023 Apply For Non-executive Posts Full Details Here

IOCL recruitment 2023 : ఐఓసీఎల్​లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!

Sharath Chitturi HT Telugu
May 15, 2023 01:47 PM IST

IOCL recruitment 2023 : ఐఓసీఎల్​లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది. అప్లికేషన్​ తుది గడవు, పరీక్ష వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐఓసీఎల్​లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
ఐఓసీఎల్​లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి (HT)

IOCL recruitment 2023 : ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి గుడ్​ న్యూస్​. 65 నాన్-​ ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది ఐఓసీఎల్​ (ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​). అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లికేషన్​ ప్రక్రియ తుది గడవు మే 30. అభ్యర్థులు తమ అప్లికేషన్​ను సంస్థ అధికారిక వెబ్​సైట్​ iocl.com లో సబ్మీట్​ చేయాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

ఐఓసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2023...

65 నాన్​ ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్​మెంట్​ జరుగుతోంది. వీటిల్లో 54 పోస్టులు జూనియర్​ ఇంజినీర్​ అసిస్టెంట్​-4 (ప్రొడక్షన్​), 7 జూనియర్​ ఇంజినీర్​ అసిస్టెంట్​- 4 (పీ అండ్​ యూ), 4 ఇంజినీరింగ్​ అసిస్టెంట్​- 4 (పీ అండ్​ యూ- ఓ అండ్​ ఎం) పోస్టులు ఉన్నాయి.

IOCL recruitment 2023 apply online : ఐఓసీఎల్​ రిక్రూట్​మెంట్​లో అప్లికేషన్​ వేయాలని భావిస్తున్న అభ్యర్థుల వయస్సు 18ఏళ్లు- 26ఏళ్ల (ఏప్రిల్​ 30 నాటికి) మధ్యలో ఉండాలి.

ఇలా అప్లై చేసుకోండి..

స్టెప్​ 1:- ముందుగా.. ఐఓసీఎల్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- అక్కడ ఉన్న కెరీర్​ ట్యాబ్​ను క్లిక్​ చేయండి.

IOCL recruitment 2023 notification : స్టెప్​ 3:- అప్లికేషన్​ ఫార్మ్​ను నింపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను వెల్లడించండి.

స్టెప్​ 4:- సంబంధిత డాక్యుమెంట్స్​ను అప్లోడ్​ చేయండి.

స్టెప్​ 5:- అప్లికేషన్​ ఫీజు చెల్లించండి.

స్టెప్​ 6:- అప్లికేషన్​ ఫార్మ్​ను సబ్మీట్​ చేయండి. సంబంధిత కాపీని ప్రిటౌంట్​ తీసుకోండి.

అప్లికేషన్​ ఫార్మ్​ను సబ్మీట్​ చేసిన తర్వాత.. అభ్యర్థులు సంబంధిత పత్రాలను జూన్​ 10లోపు సంబంధిత అధికారులకు ఆర్డినరీ పోస్ట్​ ద్వారా అందించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన డేట్స్​..

  • నోటిఫికేషన్​:- మే 1 20023
  • అప్లికేషన్​ దాఖలుకు చివరి గడువు- మే 30 2023
  • రాత పరీక్ష నిర్వహణ- జూన్​ 11 2023
  • రాత పరీక్ష ఫలితాలు- జూన్​ 27 (అంచనా)

ఐఓసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2023 నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్​ఎస్​సీ సీహెచ్​ఎస్​ఎల్​ 2023..

SSC CHSL 2023 Notification : కంబైన్డ్ హయర్ సెకండరీ లెవెల్ 2023 నోటిఫికేషన్‍ను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో క్లర్క్, జూనియర్ సెక్రటరీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు లాంటి గ్రూప్-సీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్‍ఎస్‍సీ భర్తీ చేయనుంది. సుమారు 1600 పోస్టుల కోసం ఇప్పుడు సీహెచ్ఎస్ఎల్ 2023 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ (12వ తరగతి, 10+2) విద్యార్హతగా ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు ssc.nic.in వెబ్‍సైట్‍లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు జూన్ 8 ఆఖరు గడువుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం