Internet shutdown in India : ‘ఇంటర్నెట్​ షట్​డౌన్​’- భారత్​లోనే అధికం!-internet shutdown in india is globally highest in h1 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Internet Shutdown In India Is Globally Highest In H1 2022

Internet shutdown in India : ‘ఇంటర్నెట్​ షట్​డౌన్​’- భారత్​లోనే అధికం!

Sharath Chitturi HT Telugu
Aug 05, 2022 07:28 AM IST

Internet shutdown in India : ‘ఇంటర్​నెట్​ షట్​డౌన్​’ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే.. ఇండియాలోనే అధికం! ఈ విషయం ఓ నివేదికలో బయటపడింది.

‘ఇంటర్నెట్​షట్​డౌన్​’- భారత్​లోనే అధికం!
‘ఇంటర్నెట్​షట్​డౌన్​’- భారత్​లోనే అధికం! (HT_PRINT)

Internet shutdown in India : హింసలు, ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్​ను నిషేధించడం, పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు అంతర్జాలంపై ఆంక్షలు విధించడం ప్రభుత్వాలకు సాధారమైన విషయమే. దేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఇలా చేస్తూ ఉంటాయి. అయితే.. ఇండియాలో ఇది కాస్త ఎక్కువే! 2022 తొలి ఆరు నెలల్లో.. ఇంటర్నెట్​పై ఎక్కువసార్లు నిషేధం విధించిన దేశాల్లో ఇండియా టాప్​లో ఉన్నట్టు ఓ నివేదిక పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ జాబితాలో ఉన్న తొలి 10 దేశాల్లో.. ఇండియాలోనే 85శాతం 'ఇంటర్నెట్​ షట్​డౌన్​'లు నమోదయ్యాయి. ఈ మేరకు నెట్​బ్లాక్స్​ అనే సంస్థ ఈ నివేదికను పబ్లీష్​ చేసింది. సెన్సార్​షిప్​ ఎక్కువగా ఉన్న దేశాలు ఆసియాలోనే అధికం అని వివరించింది.

ఇక భారత్​లోని జమ్ముకశ్మీర్​లో అత్యధిక 'ఇంటర్​నెట్​ షట్​డౌన్​'లు నమోదయ్యాయి. జూన్​ 17న బిహార్​లోని అనేక ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిచిపోయాయి. అగ్నిపథ్​ పథకానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం ఈ అస్త్రాన్ని ప్రయోగించిందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా.. ఈ ఏడాది తొలి భాగంలో దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఆయా సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్​ షట్​డౌన్​ జరిగింది.

కాగా.. ఇంటర్​నెట్​ షట్​డౌన్​లు తగ్గినట్టు నివేదిక పేర్కొంది. 2021లోని తొలి ఆరు నెలలతో పోల్చుకుంటే.. ఈసారి.. జాబితాలోని తొలి 10 దేశాల్లో ఇంటర్​నెట్​పై షట్​డౌన్ ఘటనలు​ 14శాతం తగ్గాయి. అప్పుడు 84గా ఉండగా.. ఇప్పుడది 72కు చేరింది.

అయితే.. ఇంటర్​నెట్​ షట్​డౌన్​ ఘటనలు తగ్గినా.. ప్రభావితమైన ప్రజల సంఖ్య మాత్రం పెరిగింది! గతేడాది 1.54బిలియన్​ మంది ప్రజలు ఇబ్బంది పడితే.. ఈసారి ఆ సంఖ్య 1.89బిలియన్​కు చేరింది.

ఇక సామాజిక మాధ్యమాలను సైతం ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఇందులో ఫేస్​బుక్​పై అత్యధిక ప్రభావం పడినట్టు వివరించింది. ట్విట్టర్​, వాట్సాప్​ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు స్పష్టం చేసింది.

జాతీయస్థాయి నుంచి.. స్థానికంగా ఏ విధంగానైనా అంతర్జాలం సేవలు నిలిచిపోయినా.. వాటిని ఇంటర్నెట్​ షట్​డౌన్​గా పరిగణించింది ఈ నివేదిక. సామాజిక మాధ్యమాలపై నియంత్రణను కూడా నివేదికలో పరిగణించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్