Pet Insurance : పెంపుడు శునకాల కోసం 'బీమా' పాలసీ వచ్చేసింది!-insurancedekho partners future generali to offer pet insurance ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Insurancedekho Partners Future Generali To Offer Pet Insurance

Pet Insurance : పెంపుడు శునకాల కోసం 'బీమా' పాలసీ వచ్చేసింది!

Sharath Chitturi HT Telugu
Aug 01, 2022 04:34 PM IST

Pet Insurance India: పెంపుడు శునకాలకు కూడా బీమా ఉంటే ఎలా ఉంటుంది? దేశంలో ఇలాంటి బీమానే వచ్చేసింది. వివరాల్లోకి వెళితే..

పెంపుడు శునకాల కోసం బీమా వచ్చేసింది
పెంపుడు శునకాల కోసం బీమా వచ్చేసింది (Mint)

Pet Insurance India: ఇప్పుడు దేశంలో పెంపుడు శునకాలకు కూడా బీమా లభిస్తోంది! పెంపుడు శునకాలకు బీమాను తీసుకొచ్చేందుకు.. ఫ్యూచర్​ జెనెరలి ఇండియా అనే ఇన్ష్యూరెన్స్​ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది స్టార్ట్​అప్​ సంస్థ ఇన్ష్యూరెన్స్​దేఖో. మరిన్ని బీమా సంస్థలతో కూడా టైఅప్​ అవ్వడానికి ప్రణాళికలు రచిస్తోంది ఈ ఇన్ష్యూరెన్స్​దేఖో.

ట్రెండింగ్ వార్తలు

పెంపుడు శునకాల బీమా ప్రిమియం.. వార్షికంగా రూ. 324తో మొదలవుతుంది. 6- 10ఏళ్ల వయస్సున్న 25 శునక జాతులకు ఈ బీమా వర్తిస్తుంది. ఈ బీమాతో పెంపుడు శునకాలను పెంచుకుంటున్న వారికి ఆర్థిక సాయం అందుతుంది. శునకాలకు ఆసుపత్రిలో చికిత్స, సర్జరీ వంటివి ఈ బీమా పాలసీలో ఉన్నాయి.

అయితే.. ఈ బీమాను పొందాలనుకునే వారు.. టర్మ్స్​ అండ్​ కండీషన్​ను క్షుణ్నంగా చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

"శునకాలకు మనుషులకు అత్యంత దగ్గర బంధం ఉంది. కుక్కలు కూడా రోగాల బారిన పడతాయి. అందుకే పెట్​ ఇన్ష్యూరెన్స్​ తీసుకొచ్చాము. పెంపుడు శునకాల తల్లిదండ్రులకు ఇది ఉపయోగపడుతుంది. దేశంలో 32మిలియన్​ పెంపుడు జంతువులు ఉన్నాయి. ఈ సంఖ్య ఏటా 12శాతం పెరుగుతోంది. ఇందులో శునకాల జనాభానే 85శాతం ఉంది. అందువల్ల పెంపుడు శునకాల కోసం ఏర్పాటు చేసిన ఈ బీమాకు ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాము," అని ఇన్ష్యూరెన్స్​ దేఖో సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అంకిత్​ అగర్వాల్​ వెల్లడించారు.

ఇండియాలో 2022 చివరి నాటికి.. ఈ పెంపుడు శునకాల బీమా వ్యాపారం.. 14శాతం పెరిగి 490మిలియన్​ డాలర్లకు చేరుతుందని అంచనా. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాపారం 32.7బిలియన్​ డాలర్లకు వెళుతుందని భావిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్