CBSE exams : స్కూల్స్​కి సీబీఎస్​ఈ కీలక ఆదేశాలు- ఇక నుంచి అన్ని పరీక్షా కేంద్రాల్లో..-install cctv cameras at all board exam centres cbse to schools ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Exams : స్కూల్స్​కి సీబీఎస్​ఈ కీలక ఆదేశాలు- ఇక నుంచి అన్ని పరీక్షా కేంద్రాల్లో..

CBSE exams : స్కూల్స్​కి సీబీఎస్​ఈ కీలక ఆదేశాలు- ఇక నుంచి అన్ని పరీక్షా కేంద్రాల్లో..

Sharath Chitturi HT Telugu
Sep 28, 2024 12:15 PM IST

CBSE exams 2025 : తన పరిధిలోని అన్ని స్కూల్స్​కి సీబీఎస్​ఈ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జామ్​ సెంటర్స్​లో కచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఉండాలని, వాటిని మానిటర్​ చేస్తూ ఉండాలని స్పష్టం చేసింది.

స్కూల్స్​కి సీబీఎస్​ఈ కీలక ఆదేశాలు..
స్కూల్స్​కి సీబీఎస్​ఈ కీలక ఆదేశాలు..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తన పరిధిలోని అన్ని స్కూల్స్​కి కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాలుగా మారే అన్ని స్కూల్స్​లో సీసీటీవీ మానిటరింగ్​ ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సన్యం భరద్వాజ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

2025లో 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను భారత్​తో పాటు విదేశాల్లోని 26 దేశాల్లోని 8,000 పాఠశాలల్లో నిర్వహించనున్నట్టు, ఈసారి 44 లక్షల మంది విద్యార్థుల పరీక్షలు రాసే అవకాశం ఉందని సీబీఎస్​ఈ వెల్లడించింది.

అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు..!

సీసీటీవీ పర్యవేక్షణ లేని పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించబోమని భరద్వాజ్ తేల్చిచెప్పారు. అన్ని ఎగ్జామ్​ సెంటర్స్​లో సీసీటీవీ కెమెరాలు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు.

“పరీక్ష హాళ్లలోని అన్ని ప్రాంతాలను - ఎంట్రీ, ఎగ్జిట్​, డెస్క్​లు సిసిటివి కెమెరాలు కవర్ చేయాలి. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ తప్పనిసరిగా కెమెరాల పరిధిలో ఉండాలి,” అని బోర్డు తెలిపింది.

కెమెరాలు హై రిజల్యూషన్​తో ఉండాలని, విద్యార్థుల చర్యలు, పరీక్షా సామగ్రిని వీక్షించేలా చూడాలని సీబీఎస్​ఈ స్పష్టం చేసింది. పరీక్ష అంతటా కెమెరాలు రికార్డ్ చేయాలని, ఫుటేజీని సురక్షితంగా- అవసరమైతే సమీక్ష కోసం సులభంగా తిరిగి పొందే విధంగా భద్రపరచాలని పేర్కొంది.

ప్రతి 10 గదులకు ఒక ఇన్విజిలేటర్​ని నియమించి ఫుటేజీని పర్యవేక్షించి, అక్రమాలు జరిగిన వెంటనే నివేదించాలని సీబీఎస్​ఈ వెల్లడించింది.

మరిన్ని వివరాలకు సీబీఎస్ఈ నోటిఫికేషన్​ని చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 పరీక్షలు..

సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. రెండు తరగతులకు సంబంధించిన సవివరమైన డేట్​ షీట్లను తగిన సమయంలో సీబీఎస్​ఈ జారీ చేస్తుంది.

మునుపటి ట్రెండ్‌ల ఆధారంగా 10వ తరగతి పరీక్షల తాత్కాలిక తేదీలు ఇక్కడ ఉన్నాయి.

ఫిబ్రవరి 15, 2025 : పెయింటింగ్, గురుంగ్, రాయ్, తమాంగ్, షెర్పా

ఫిబ్రవరి 17, 2025 : సెక్యూరిటీ, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ మార్కెట్‌లు, పర్యాటకం, బ్యూటీ అండ్ వెల్‌నెస్

ఫిబ్రవరి 19, 2025: హిందుస్తానీ సంగీతం, బుక్ కీపింగ్, అకౌంటెన్సీ

ఫిబ్రవరి 20, 2025: సంస్కృతం

ఫిబ్రవరి 21, 2025 : ప్రాంతీయ భాషలు (ఉర్దూ, బెంగాలీ, తమిళం మొదలైనవి)

ఫిబ్రవరి 24, 2025: హిందీ

ఫిబ్రవరి 25, 2025: వివిధ భాషా కోర్సులు

ఫిబ్రవరి 26, 2025: పంజాబీ, సింధీ, మలయాళం మొదలైనవి.

మార్చి 3, 2025: ఇంగ్లీష్ (భాష, సాహిత్యం)

మార్చి 4, 2025: వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ అంశాలు

మార్చి 7, 2025: సైన్స్

మార్చి 10, 2025: హోమ్ సైన్స్, మల్టీ స్కిల్ ఫౌండేషన్

మార్చి 11, 2025: అరబిక్, రష్యన్, జర్మన్, మొదలైనవి.

మార్చి 12, 2025: సోషల్ సైన్స్

మార్చి 15, 2025: గణితం (ప్రామాణికం, ప్రాథమికం)

మార్చి 17, 2025: కంప్యూటర్ అప్లికేషన్స్, IT, AI

రాబోయే బోర్డు పరీక్షల నమూనా పత్రాలను సీబీఎస్​ఈ ఇటీవలే విడుదల చేసింది. వాటిని cbseacademic.nic.in లో చెక్​ చేసుకోవచ్చు. తుది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పరీక్ష మార్కింగ్ స్కీమ్, నమూనా, పరీక్షలో అడిగే ప్రశ్నల రకాలను అర్థం చేసుకోవడానికి అకడమిక్ వెబ్​సైట్స్​లో నమూనా పేపర్లను చెక్​ చేసుకోవచ్చు.

సంబంధిత కథనం