Instagram repost feature : ఇన్​స్టాగ్రామ్​లో 'రీపోస్ట్​' ఫీచర్​ వచ్చేస్తోంది..!-instagram is testing new repost feature ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Instagram Is Testing New Repost Feature

Instagram repost feature : ఇన్​స్టాగ్రామ్​లో 'రీపోస్ట్​' ఫీచర్​ వచ్చేస్తోంది..!

Sharath Chitturi HT Telugu
Sep 12, 2022 07:56 PM IST

Instagram repost feature : యూజర్స్​కు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు ఇన్​స్టాగ్రామ్​ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్​ని తీసుకొస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు రీపోస్ట్​ ఫీచర్​ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.

ఇన్​స్టాగ్రామ్​లో 'రీపోస్ట్​' ఫీచర్​ వచ్చేస్తోంది..!
ఇన్​స్టాగ్రామ్​లో 'రీపోస్ట్​' ఫీచర్​ వచ్చేస్తోంది..! (AP)

Instagram repost feature : ట్విట్టర్​లో ఎవరి ట్వీట్​ అయినా నచ్చితే.. వెంటనే 'రీట్వీట్​' చేసేస్తూ ఉంటాము. ఆ రీట్వీట్​ మన ప్రొఫైల్​లో కనిపిస్తుంది. కానీ ఇన్​స్టాగ్రామ్​లో ఇంత కాలం అది కుదరలేదు. ఇతరుల పోస్ట్​లను మనం కేవలం మన స్టేటస్​లోనే పెట్టుకోవడానికి వీలుంటుంది. అలా ప్రొఫైల్​లో షేర్​ చేయాలంటే.. థర్డ్​ పార్టీ యాప్​లు డౌన్​లోడ్​ చేసుకోవాల్సి వస్తోంది. ఇక ఈ కష్టాలకు చెక్​ పడనుంది! ఇప్పుడు.. ఇతరుల పోస్ట్​లను మన ఖాతాలో కూడా 'రీపోస్ట్​' చేయగలము! ఈ మేరకు కొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు ఇన్​స్టాగ్రామ్​ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఇన్​స్టాగ్రామ్​ రీపోస్ట్​ ఫీచర్​ని.. సోషల్​ మీడియా అనలిస్ట్​ మాట్​ నవర్ర గుర్తించారు. ఈ మేరకు తన ట్విట్టర్​ ఖాతాలో ఓ ట్వీట్​ చేశారు. ఆ ఫొటోలో.. 'రీపోస్ట్​' ఆఫ్షన్​ కనిపిస్తోంది.

Instagram new features : దీనిపై ఇన్​స్టాగ్రామ్​ స్పందించింది. ఫీడ్​ని రీపోస్ట్​ చేసే వెసులుబాటును యూజర్లకు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది.

అయితే.. ఇది ఇంకా టెస్టింగ్​ దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత కొన్ని అకౌంట్లలో ఈ కొత్త ఫీచర్​ను పరీక్షించి.. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టాగ్రామ్​ రీపోస్ట్​ ఫీచర్​ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ప్రస్తుతం ఇన్​స్టాగ్రామ్​ స్టేటస్​లో రీపోస్ట్​ చేస్తే.. అది 24గంటలు మాత్రమే ఉంటుంది. ఇక ప్రొఫైల్​లో రీపోస్ట్​ చేస్తే.. మనం డిలీట్​ చేసేంతవరకు ఇది కనిపిస్తుంది. ప్రముఖ సామాజిక మాధ్యమాలు ట్విట్టర్​, ఫేస్​బుక్​లో ఈ ఆఫ్షన్​ చాలా కాలం నుంచి యూజర్లకు అందుబాటులో ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం