whisky challenge: రూ. 75 వేల కోసం ఛాలెంజ్ చేసి, 20 నిమిషాల్లో 2 బాటిళ్ల విస్కీ తాగి.. చివరకు..
Social media influencer: ఒక చాలెంజ్ లో రూ. 75 వేలు గెల్చుకోవడం కోసం ఒక 21 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ 20 నిమిషాల్లో రెండు బాటిళ్ల విస్కీ తాగేశాడు. కానీ, వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన థాయ్ లాండ్ లో జరిగింది.
Thailand Social media influencer: రూ. 75 వేల కోసం చాలెంజ్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడో యువకుడు. థాయ్ లాండ్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా ఫేమస్ అయిన ఆ 21 ఏళ్ల యువకుడు ఒక చాలెంజ్ లో రూ. 75 వేలు గెల్చుకోవడం కోసం 20 నిమిషాల్లో రెండు బాటిళ్ల విస్కీ తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. థాయ్ లాండ్ కు చెందిన థన్ కర్న్ కాంతి అనే 21 ఏళ్ల యువకుడు సోషల్ మీడియాలో 'బ్యాంక్ లీసెస్టర్ ' గా ఫేమస్. అతడు 30 వేల థాయ్ బాత్ (రూ.75,228) చాలెంజ్ లో భాగంగా రెండు మద్యం బాటిళ్లను కేవలం 20 నిమిషాల్లో తాగేశాడు.
గతంలో కూడా..
అయితే గతంలో కూడా డబ్బుల కోసం ఆ యువకుడు హ్యాండ్ శానిటైజర్, వాసాబీ వంటివి తాగి ఆసుపత్రి పాలయ్యాడు. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా థాయ్ లాండ్ లో చంతాబురిలోని థా మాయి జిల్లాలో జరిగిన బర్త్ డే పార్టీలో ఈ లిక్కర్ డ్రింకింగ్ చాలెంజ్ ను యాక్సెప్ట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. 350 మిల్లీలీటర్ల ఒక్కో రీజెన్సీ విస్కీ బాటిల్ కు 15,000 బాత్ లు ఇస్తామని ఆ యువకుడికి వారు ఆఫర్ చేశారు. దాంతో, అతడు రెండు విస్కీ బాటిళ్లను 20 నిమిషాల వ్యవధిలో తాగేశాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.
నిందితుల అరెస్ట్
ఆ యువకుడితో ఈ చాలెంజ్ చేసిన వ్యక్తులను థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఇంటి నుంచి పిస్టల్, బ్యాంక్ పాస్ బుక్ లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు మరియు నిర్లక్ష్య ప్రవర్తన మరణానికి కారణమైనట్లు తేలింది. పదేళ్ల వరకు జైలు శిక్ష, 20 వేల బాత్ (రూ.50,152) జరిమానా విధించే అవకాశం ఉంది.
స్పీడ్ గా తాగకండి..
కాగా, తక్కువ సమయంలో అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం కోమా లేదా మరణానికి దారితీస్తుందన్న విషయాన్ని అంతా తెలుసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియా యూజర్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఛాలెంజ్ చేసినవారిని పలువురు విమర్శిస్తున్నారు. రెండు బాటిళ్ల విస్కీ తాగి, కాంతీ కుప్పకూలి మరణించిన క్షణాలను ఒక వ్యక్తి వీడియో తీశాడు.
కుటుంబం కోసం..
ఈ విషాదం తర్వాత, తన కుటుంబాన్ని పోషించడానికి తాను ఇలాంటి తీవ్రమైన సవాళ్లను అంగీకరిస్తున్నానని థన్ కర్న్ కాంతి గతంలో సోషల్ మీడియా (social media) లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నా కుటుంబాన్ని పోషించడం కోసం ధనవంతుల నుంచి డబ్బును పొందడానికే ఇలా చేస్తున్నానని అతడు ఆ వీడియోలో పేర్కొన్నాడు.