Crime news | 'ఓవెన్​'లో పసికందు మృతదేహం.. తల్లిదే నేరం!-infant found dead in microwave oven ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Infant Found Dead In Microwave Oven

Crime news | 'ఓవెన్​'లో పసికందు మృతదేహం.. తల్లిదే నేరం!

HT Telugu Desk HT Telugu
Mar 22, 2022 11:36 AM IST

ఢిల్లీలో ఓ రెండు నెలల పసికందు మృతదేహం.. మైక్రోవేవ్​ ఓవెన్​లో కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా.. ఇందులో పసికందు తల్లి హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఓవెన్​లో పసికందు మృతదేహం
ఓవెన్​లో పసికందు మృతదేహం (Hindustan times telugu)

Infant found dead in microwave | దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చిరాగ్​ దిల్లీ ప్రాంతంలో ఓ రెండు నెలల పసికందు మృతదేహం ఓ మైక్రోవేవ్​ ఓవెన్​లో కనిపించింది. పసికందు తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

ట్రెండింగ్ వార్తలు

పసికందు మరణవార్త గురించి సోమవారం మధ్యాహ్నం 3:15 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పసికందు తల్లిదండ్రులు గుల్షన్​ కౌషిక్​, డింపుల్​ కౌషిక్​లను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనలో పసికందు తల్లి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆడబిడ్డ పుట్టుందనే కారణంతో తల్లి.. ఆమెను చంపి ఉండొచ్చని భావిస్తున్నారు.

"ఈ ఏడాది జనవరిలో పసికందు పుట్టింది. ఆమెకు అనన్య అనే పెట్టారు. కానీ ఆడబిడ్డ పుట్టిందని డింపుల్​ బాధపడేది. ఇదే విషయంపై భర్తతో అనేకమార్లు గొడవ పడింది," అని ఆ కుటుంబంతో సంబంధం ఉన్న కొందరు మీడియాకు వెల్లడించారు.

గుల్షన్​, డింపుల్​కు అనన్య.. రెండో సంతానం. వారికి ఓ నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చిన పొరుగింటి వ్యక్తి.. సోమవారం జరిగిన పరిణామాలను వెల్లడించాడు. "డింపుల్​.. ఇంటి డోర్​ను లాక్​ చేసుకుని లోపలే ఉండిపోయింది. ఆమె అత్త ఎన్నిసార్లు తలుపు కొట్టినా డింపుల్​ డోర్​ తెరవలేదు. ఇంట్లోని ఓ గ్లాస్​ను పగలగొట్టి మేము లోపలికి ప్రవేశించాము. కొడుకు వద్ద.. అపస్మారక స్థితిలో పడి ఉన్న డింపుల్​ను మేము చూశాము. కానీ పసికందు కనిపించలేదు. తర్వాత.. అనన్య నాన్నమ్మ, ఇరుగుపొరుగు వారందరు ఆమె కోసం ఇల్లంతా వెతికారు. చివరికి..రెండో అంతస్తులో ఉన్న ఓవెన్​లో రెండు నెలల పసికందు మృతదేహం కనిపించింది," అని వెల్లడించాడు.

ఘటన జరిగిన సమయంలో మహిళ భర్త గుల్షన్​ కౌషిక్​.. బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్