Indigo sweet 16 sale : రూ. 1,616తో విమాన ప్రయాణం.. ఆఫర్​కు నేడే చివరి రోజు-indigo sweet 16 anniversary sale offer ends today 5th august 2022 check details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Indigo Sweet 16 Anniversary Sale Offer Ends Today 5th August 2022, Check Details Here

Indigo sweet 16 sale : రూ. 1,616తో విమాన ప్రయాణం.. ఆఫర్​కు నేడే చివరి రోజు

Sharath Chitturi HT Telugu
Aug 05, 2022 10:07 AM IST

Indigo sweet 16 sale : ఇండిగో ప్రవేశపెట్టిన అదిరిపోయే ఆఫర్​ నేటితో ముగియనుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

రూ. 1,616తో విమాన ప్రయాణం.. ఆఫర్​కు నేడే చివరి రోజు
రూ. 1,616తో విమాన ప్రయాణం.. ఆఫర్​కు నేడే చివరి రోజు (REUTERS)

Indigo sweet 16 sale : ఇండిగో విమానయాన సంస్థ తీసుకొచ్చిన 'స్వీట్​ 16' ఆఫర్​ నేటితో ముగియనుంది. 16 వసంతాల సంస్థ ప్రయాణాన్ని పురస్కరించుకుని.. ఈ నెల 3న ఈ ఆఫర్​లను ఆవిష్కరించింది ఇండిగో. 2022 ఆగస్టు 18 నుంచి 2023 జులై 16 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్​ వర్తిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇండిగో ప్రకారం.. ఈ ఆఫర్లతో తక్కువ ఖర్చుతోనే దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు!

"మా స్వీట్​ 16 వచ్చేసింది. మీకోసం స్వీట్​ ఆఫర్​ తీసుకొచ్చాము. రూ. 1,616తో మొదలయ్యే టికెట్లను బుక్​ చేసుకోండి(కండీషన్స్​ అప్లై). ఇక ఆలస్యం చేయకండి. https://bit.ly/3vC8JhE లో బుక్​ చేసుకోండి," అని ఇండిగో సంస్థ కొన్ని రోజుల క్రితం ట్వీట్​ చేసింది.

6ఈ రివార్డ్స్​తో టికెట్లు బుక్​ చేసుకుంటే 25శాతం క్యాష్​బ్యాక్​ కూడా లభిస్తుంది. హెచ్​ఎస్​బీసీతో టికెట్లు బుక్​ చేసుకుంటే రూ. 800 వరకు క్యాష్​బ్యాక్​ పొందవచ్చు.

అయితే.. ఈ ఆఫర్​లో ఎన్ని సీట్లు కేటాయించారు? ఎన్ని విమానాలకు ఈ ఆఫర్​ వర్తిస్తుంది అన్న విషయాలను ఇండిగో సంస్థ వెల్లడించలేదు. కానీ చాలా తక్కువ మందికే ఈ ఆఫర్​ను ఇచ్చేందుకు, అది కూడా సమయానికి తగ్గట్టు చూసుకోవాలని ఇండిగో భావిస్తోంది.

మరోవైపు.. ఈ ఆఫర్​ను ఇతర స్కీమ్​, ఆఫర్లు, ప్రొమోషన్లు, నాన్​-ఎన్​క్యాషెబుల్​, నాన్​-ట్రాన్సఫరెబుల్​, నాన్​-ఎక్స్​ఛెంజిబుల్​ వాటితో కలపలేరు. ఇండిగో గ్రూప్​ బుకింగ్స్​పైనా ఈ ఆఫర్​ చెల్లదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్