June Power Consumption : జూన్‌లో కరెంట్‌ను అతిగా వాడేసిన భారతీయులు.. 9 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం!-indias power consumption rises nearly 9 percentage to hit 152 38 billion units in june ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  June Power Consumption : జూన్‌లో కరెంట్‌ను అతిగా వాడేసిన భారతీయులు.. 9 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం!

June Power Consumption : జూన్‌లో కరెంట్‌ను అతిగా వాడేసిన భారతీయులు.. 9 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం!

Anand Sai HT Telugu
Jul 01, 2024 03:49 PM IST

June Power Consumption : జూన్‌ నెలలో భారతీయులు విద్యుత్‌ను అదిగా వాడేశారు. దీంతో 9 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. గతంలో పోల్చితే ఇది ఎక్కువ.

ఇండియాలో జూన్ నెల విద్యుత్ వినియోగం
ఇండియాలో జూన్ నెల విద్యుత్ వినియోగం

ఎండ వేడిమి కారణంగా ఎయిర్ కండిషనర్లు, కూలర్లు వంటి ఉపకరణాలను అధికంగా ఉపయోగించారు భారతీయులు. దీని వల్ల జూన్ నెలలో భారత విద్యుత్ వినియోగం దాదాపు 9 శాతం పెరిగి 152.38 బిలియన్ యూనిట్లకు (బీయూ) చేరుకుంది. అధికారిక గణాంకాల ప్రకారం 2023 జూన్‌లో విద్యుత్ వినియోగం 140.27 బిలియన్ యూనిట్లుగా ఉంది.

ఒక రోజులో అత్యధిక సరఫరా (గరిష్ట విద్యుత్ డిమాండ్ తీర్చడం) 2024 జూన్‌లో 223.29 గిగావాట్ల నుండి 245.41 గిగావాట్లకు పెరిగింది. 2023 జూన్‌లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 224.10 గిగావాట్లుగా నమోదైంది. ఈ ఏడాది మే నెలలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 250.20 గిగావాట్లకు చేరుకుంది. అంతకుముందు 2023 సెప్టెంబర్‌లో 243.27 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది.

2024 జూన్‌లో పగటిపూట 235 గిగావాట్లు, సాయంత్రం వేళల్లో 225 గిగావాట్లు విద్యుత్ డిమాండ్ ఉంటుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 260 గిగావాట్లకు చేరుకోవచ్చని మంత్రిత్వ శాఖ అనుకుంది.

జూన్ నెలాఖరులో మండే ఎండలు, తేమ కారణంగా ప్రజలు ఎయిర్ కండీషనర్లు, కూలర్లు వంటి శీతలీకరణ పరికరాలను విపరీతంగా ఉపయోగించాల్సి వచ్చింది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు దేశంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగింది.

రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం స్థిరంగా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాను రాను ఎయిర్ కండిషనర్ల వాడకం కూడా అనివార్యమవుతుందని వారు తెలిపారు. అయితే మరికొన్ని రోజుల్లో వానలు అతిగా పడే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వాడకం తగ్గే అవకాశం ఉంది.

రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాజస్థాన్, పంజాబ్, హర్యానాలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. సోమవారం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రానున్న మూడు రోజుల్లో రుతుపవనాలు దేశమంతా విస్తరించే అవకాశం ఉంది.

Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.