Ola and Uber merger | ఓలా, ఉబ‌ర్ విలీనం వార్త‌లు నిజ‌మేనా?-indias ola and uber deny report of merger talks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India's Ola And Uber Deny Report Of Merger Talks

Ola and Uber merger | ఓలా, ఉబ‌ర్ విలీనం వార్త‌లు నిజ‌మేనా?

HT Telugu Desk HT Telugu
Jul 29, 2022 10:57 PM IST

Ola and Uber merger | ఇండియాలో ప్ర‌ముఖ క్యాబ్ అగ్రిగేట‌ర్ సంస్థ‌లైన ఓలా, ఉబ‌ర్ విలీనం కాబోతున్నాయా? భార‌త్‌లో టాప్ 2 ట్యాక్సీ అగ్రిగేట‌ర్ సంస్థ‌లు ఇవి. వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డం కోసం పోటాపోటీగా పోరాడుతున్న ఈ రెండు సంస్థ‌లు విలీనం అవుతున్నాయ‌న్న వార్త‌ల్లో నిజ‌మెంత‌?

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Ola and Uber merger | భార‌త్‌లోని న‌గ‌రాల్లో ప్రయాణం అంటే మొద‌ట గుర్తొచ్చేవి ఓలా, ఉబ‌ర్‌. అంత‌లా భార‌తీయుల‌తో మ‌మేకం అయ్యాయి ఆ రెండు సంస్థ‌లు. ఇప్పుడు ఆ రెండు సంస్థ‌లు క‌లిసిపోబోతున్నాయ‌న్న వార్తలు వ‌స్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Ola and Uber merger | అమెరికాలో మీటింగ్‌

ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ భ‌వీశ్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల అమెరికాలోని సాన్ ఫ్రాన్సెస్కోలో ఉబ‌ర్ సంస్థ‌కు చెందిన ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ స‌మావేశంలో రెండు సంస్థ‌ల విలీనంపై ప్రాథ‌మికంగా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని కూడా మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దాంతో, ఇప్పుడు ఆ రెండు సంస్థ‌లు ఈ విష‌యంపై వివ‌ర‌ణ ఇచ్చాయి.

Ola and Uber merger | అంతా అబ‌ద్ధం

ఓలా, ఉబ‌ర్ సంస్థ‌ల విలీనం వార్త పెద్ద అబ‌ద్ధ‌మ‌ని, అలాంటి ఆలోచ‌న ఏదీ లేద‌ని ఆ రెండు సంస్థ‌లు శుక్ర‌వారం విడుద‌ల చేసిన రెండు వేర్వేరు ప్ర‌క‌ట‌న‌ల్లో స్ప‌ష్టం చేశాయి. `ఓలా ఎల‌క్ట్రిక్` సీఈఓ భ‌వీశ్ అగ‌ర్వాల్ ఈ విలీనం వార్త‌ను అర్థం లేని చెత్త అని స్ప‌ష్టం చేశారు. అలాంటి ఆలోచ‌నే లేద‌ని తేల్చిచెప్పారు. భార‌త్‌లో ఓలా మంచి లాభాల‌తో అభివృద్దిప‌థంలో దూసుకుపోతోంద‌ని ట్వీట్ చేశారు. మేం ఎవ‌రితో విలీనం కావ‌డం లేదు. వేరే ఎవ‌రైనా భార‌త్‌లోని త‌మ బిజినెస్‌ల‌ను వ‌దిలివెళ్లాల‌నుకుంటే మేం స్వాగ‌తిస్తాం` అని ఆయ‌న ట్వీట్ చేశారు.

Ola and Uber merger | ఉబ‌ర్ కూడా

ఈ విలీనం వార్త‌ను ఉబ‌ర్ కూడా ఖండించింది. ఆ వార్త నిరాధార‌మ‌ని, తాము ఎలాంటి మెర్జ‌ర్ చ‌ర్చ‌ల్లో లేమ‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త్‌లో త‌మ‌ ఫుడ్ డెలివ‌రీ బిజినెస్ `ఉబ‌ర్ ఈట్స్‌`ను ఉబ‌ర్ సంస్థ ఇప్ప‌టికే జొమాటోకు అమ్మివేసింది. ఈ లావాదేవీ 2020 జ‌న‌వ‌రిలో జ‌రిగింది. అలాగే, ఓలా కూడా త‌మ గ్రోస‌రీ బిజినెస్‌ను మూసేసింది. అలాగే, ఓలా త‌మ ఎల‌క్ట్రిక్ వాహ‌న విభాగంలో పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు కూడా పెట్టింది.

WhatsApp channel