Biryani ATM: ‘ఈ ఏటీఎం నుంచి బిర్యానీ పాకెట్స్ వస్తాయి..’-indias first automated biryani take away hotel is in south indian city chennai ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India's First Automated Biryani Take Away Hotel Is In South Indian City Chennai

Biryani ATM: ‘ఈ ఏటీఎం నుంచి బిర్యానీ పాకెట్స్ వస్తాయి..’

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 09:38 PM IST

Biryani ATM: బిర్యానీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఇండియన్స్ కు అది ఆల్ టైం ఫేవరిట్ ఫుడ్. ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ వరల్డ్ ఫేమస్. ఇప్పుడు ఈ బిర్యానీ పార్శిల్స్ ను ఏటీఎంలో డబ్బులు తీసుకున్నట్లుగా తీసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Biryani ATM in Chennai: చెన్నైలో ఉందీ బిర్యానీ ఏటీఎం. చెన్నైలో బిర్యానీకి ప్రఖ్యాతి గాంచిన ‘బాల్ వీటు కళ్యాణం బిర్యానీ’ లేదా సింపుల్ గా ‘బీవీకే బిర్యానీ’ హోటల్ లో ఈ బిర్యానీ ఏటీఎం ఉంది. ఇప్పటికే చెన్నై నగరంలో ఎక్కడికైనా 60 నిమిషాల్లో బిర్యానీని హోం డెలివరీ చేస్తూ బీవీకే బిర్యానీ ఫేమస్ అయింది. వారి బిర్యానీ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందని రివ్యూస్ చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Biryani ATM: ఏటీఎం ఎలా పని చేస్తుంది?

ఇది కూడా సాధారణ ఏటీఎం మెషిన్ మాదిరిగానే ఉంటుంది. కానీ స్క్రీన్ సైజ్ పెద్దదిగా ఉంటుంది. 32 అంగుళాల స్క్రీన్ ను ఈ సర్వీస్ కోసం ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ పై ఆ హోటల్ లో లభించే బిర్యానీల మెన్యూ డిస్ ప్లే అయి ఉంటుంది. మీరు అందులో మీకు కావాల్సినవి సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత డెబిట్, క్రెడిట్, యూపీఐ, లేదా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా బిల్ పే చేయాలి. కొన్ని నిమిషాల్లోనే మీరు కోరుకున్న బిర్యానీ నీట్ గా ప్యాక్ అయి మీ ముందుకు వస్తుంది. బిర్యానీ రెడీ కాగానే మీకు స్క్రీన్ పై ప్రాంప్టింగ్ వస్తుంది. అక్కడ ఓపెన్ డోర్ ఆప్షన్ ను క్లిక్ చేయగానే, డోర్ ఓపెన్ అవుతుంది. బిర్యానీ ప్యాకెట్ మీ ముందు ఉంటుంది.త్వరలో మరిన్ని బ్రాంచ్ ల్లోనూ ఈ సర్వీసును ప్రారంభించాలని ‘బీవీకే బిర్యానీ’ ఆలోచిస్తోంది. అంతేకాదు, ఇతర నగరాల్లోనూ తమ బిర్యానీ సెంటర్ లను ప్రారంభించే యోచనలో ఉంది.

BVK Biryani ATM: 2020 నుంచి

ఈ బీవీకే బిర్యానీ (BVK Biryani)ని 2020లో ప్రారంభించారు. ఇక్కడ బిర్యానీ వండేందుకు ఉపయోగించే ప్రతీ దినుసునూ ప్రత్యేకంగా ఎంపిక చేసి తీసుకుంటామని యాజమాన్యం చెబుతోంది. మసాలా దినుసులను ఏ రోజుకు ఆ రోజు తామే స్వయంగా తయారు చేస్తామని, తాజా చికెన్ లేదా మటన్ ను మాత్రమే వాడుతామని వివరించారు. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ లపై కాకుండా, సంప్రదాయంగా కట్టెల పొయ్యిపై బిర్యానీ తయారు చేస్తామని తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్