Visa-free entry: గుడ్ న్యూస్.. ఇక ఈ దేశాలకు కూడా వీసా ఫ్రీ ఎంట్రీ
Visa-free entry: భారతీయులకు వీసా లేకండానే తమ దేశంలో పర్యటించే అవకాశం కల్పిస్తున్న దేశాల జాబితాలోకి తాజాగా మలేసియా కూడా చేరింది.
Visa-free entry: ఇటీవల రూపొందించిన పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. బలమైన పాస్ పోర్ట్ ఉన్న దేశాల జాబితాలో భారత్ స్థానం 137. పాస్ పోర్ట్ స్ట్రెంత్ ను ఆ దేశ పౌరులకు ఎన్ని విదేశాలు వీసా ఫ్రీ ఎంట్రీని ఇస్తాయనే విషయం ఆధారంగా నిర్ధారిస్తారు. అలాగే, పాస్ పోర్ట్ పవర్ ర్యాంకింగ్స్ లో భారత్ స్థానం 68 అని ఆ ఇండెక్స్ తేల్చింది.
26 దేశాలు..
ప్రస్తుతం భారతీయ పాస్ పోర్ట్ ఉన్నవారు 23 దేశాల్లో వీసా లేకుండా (visa-free), 49 దేశాల్లో వీసా ఆన్ అరైవల్ (visa-on-arrival) విధానం ద్వారా పర్యటించవచ్చు. ఇప్పుడు తాజాగా, మలేసియా సహా మరో మూడు దేశాలు కూడా భారతీయ పాస్ పోర్ట్ ఉన్నవారు తమ దేశంలో వీసా లేకుండా (visa-free) పర్యటించవచ్చని ప్రకటించింది. తమ తమ దేశాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా ఆయా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దాంతో, ప్రస్తుతం భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్న దేశాల జాబితా 26కి చేరింది. తాజాగా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చిన దేశాలు మలేసియా, శ్రీలంక, థాయిలాండ్.
ఇవే ఆ దేశాలు..
అంగోలా, బార్బడోస్, భూటాన్, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గాబన్, గాంబియా, గ్రెనడా, హైతీ, జమైకా, కజకిస్తాన్, కిరిబాటి, మకావో, మారిషస్, మైక్రోనేషియా, నేపాల్, పాలస్తీనియన్ టెరిటరీలు, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెనెగల్, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, ట్రినిడాడ్ మరియు టొబాగో, వనాటు, శ్రీలంక, థాయిలాండ్ మరియు మలేషియాలలో భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా ఫ్రీ ఎంట్రీని పొందవచ్చు. డిసెంబర్ 1 నుంచి భారత్, చైనా పౌరులు 30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీని మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు.