Canada news: కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి; ‘ఖలిస్తాన్’ హస్తంపై పోలీసుల అనుమానాలు-indianorigin family killed in suspicious house fire in canada ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Indian-origin Family Killed In 'Suspicious' House Fire In Canada

Canada news: కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి; ‘ఖలిస్తాన్’ హస్తంపై పోలీసుల అనుమానాలు

HT Telugu Desk HT Telugu
Mar 16, 2024 02:21 PM IST

Canada crime news: కెనడాలో దారుణం చోటు చేసుకుంది. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ లో గత వారం అనుమానాస్పద స్థితిలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి టీనేజ్ కుమార్తె మృతి చెందారు.

అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం
అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం (Bloomberg)

Canada crime news: కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ లో గత వారం అనుమానాస్పదంగా జరిగిన అగ్నిప్రమాదంలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి టీనేజ్ కుమార్తె మృతి చెందారు. మార్చి 7న బ్రాంప్టన్ లోని బిగ్ స్కై వే, వాన్ కిర్క్ డ్రైవ్ ప్రాంతంలోని ఓ ఇంటిని మంటలు చుట్టుముట్టినట్లుగా తమకు సమాచారం వచ్చిందని పీల్ పోలీసులు తెలిపారు. మంటలను ఆర్పివేసిన తర్వాత, మంటలు చెలరేగిన ఇంటి లోపల మృతదేహాలను కనుగొన్నారు, అయితే ఆ ప్రమాదంలో ఈ ముగ్గురే చనిపోయారా? లేక ఇంకవరైనా ఉన్నారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

భారత సంతతి కుటుంబం..

ఈ అనుమానాస్పద అగ్ని ప్రమాదంలో భారత సంతతికి చెందిన రాజీవ్ వారికూ(51), ఆయన భార్య శిల్పా కొత్త(47), వారి కుమార్తె మహేక్ వారికూ(16) ఉన్నారు. అయితే, ఇది కేవలం అగ్ని ప్రమాదం కాదని, దీని వెనుక ఇండో-కెనడా బిజినెస్ నెట్ వర్కింగ్ ఈవెంట్ భగ్నం చేసేందుకు ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారులు చేసిన కుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ముందు ఆ ఇంట్లో వారు ఉన్నట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదం అనుమానాస్పదంగా ఉందని పీల్ పోలీస్ ఆఫీసర్ టారిన్ యంగ్ వ్యాఖ్యానించారు. ‘‘ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని ఒంటారియో ఫైర్ మార్షల్ భావించినందున మేము దీనిని అనుమానాస్పదంగా పరిగణిస్తున్నాము" అని యంగ్ పేర్కొన్నారు.

స్థానికుల వాంగ్మూలం

కాగా భారత సంతతికి చెందిన రాజీవ్ వారికూ(51) కుటుంబం గురించి స్థానికులను పోలీసులు విచారించారు. సుమారు 15 ఏళ్లుగా తమ కుటుంబం అదే వీధిలో నివసిస్తోందని, వారి తీరులో ఎలాంటి అనుమానాస్పద విషయాలు కనిపించలేదని, వారితో తనకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని మృతుడి పొరుగింటి వ్యక్తి కెన్నెత్ యూసఫ్ తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని యూసఫ్ చెప్పారు. "మేము బయటకు వచ్చేసరికి, ఇల్లు అగ్నికి ఆహుతైంది. చాలా బాధాకరం. కొద్ది గంటల్లోనే అంతా నేలమట్టమైంది' అని యూసఫ్ పేర్కొన్నాడు.

IPL_Entry_Point