Premium tatkal ticket : ప్రయాణికులకు అసౌకర్యాలు కలగకుండా చూసుకునేందుకు భారతీయ రైల్వే నిత్యం కృషిచేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో వెసులుబాట్లను ప్రవేశపెట్టింది. తాజాగా.. 'ప్రీమియం తత్కాల్ టికెట్'ను మరోమారు తీసుకొచ్చింది.
ప్రీమియం తత్కాల్ టికెట్‌తో.. కన్ఫర్మ్ టికెట్లు పొందడం ప్రయాణికులకు మరింత సులభమవుతుంది. కాగా.. సాధారణ తత్కాల్ టికెట్ల కన్నా.. దీని రేటు కాస్త ఎక్కువ. కానీ ప్రీమియంలో తత్కాల్ టికెట్‌ను పొంది, ట్రైన్లో బెర్తును పొందడం సులభమవుతుందని భారతీయ రైల్వే వెల్లడించింది.
ఇప్పటికే ఈ ప్రీమియం తత్కాల్ టికెట్ సౌలభ్యం 80రైళ్లల్లో మొదలైంది. మరిన్ని రైళ్లల్లోనూ దీనిని అమలు చేసేందుకు భారతీయ రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. దీనితో ప్రయాణికులకు బెర్తు ఫిక్స్ అవ్వడంతో పాటు.. రైల్వే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.
Tatkal Ticket : వాస్తవానికి ఈ ప్రీమియం తత్కాల్ టికెట్ వెసులుబాటు ఎప్పటి నుంచో అమల్లో ఉంది. 2020-21లో ప్రీమియం తత్కాల్‌తో రైల్వేకు రూ. 500కోట్లు ఆదాయం వచ్చింది. కానీ.. కొవిడ్ సంక్షోభంతో ఈ వెసులుబాటును నిలిపివేసింది భారతీయ రైల్వే. ఇక ఇప్పుడు మళ్లీ ప్రవేశపెట్టింది.
సాధారణ తత్కాల్ టికెట్ బుకింగ్- ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్.. ఒకే విధంగా ఉంటుంది. ప్రయాణికులు చెల్లించే ధరల్లోనే వ్యత్యాసం ఉంటుంది.
సంబంధిత కథనం