Indian Navy Agniveer Recruitment : ఇండియన్ నేవీలో అగ్నివీర్ నియామకానికి నేటి నుంచి అప్లికేషన్లు..
Indian Navy Agniveer Recruitment 2023 : ఇండియన్ నేవీలో 1600కుపైగా అగ్నివీర్ పోస్టుల నియామకానికి అప్లికేషన్ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. పూర్తి వివరాలు..
Indian Navy Agniveer Recruitment 2023 : ఇండియన్ నేవీలో 1,638 అగ్నివీర్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను agniveernavy.cdac.in లో దాఖలు చేసుకోవచ్చు. అప్లికేషన్లకు తుది గడువు జూన్ 15 అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు..

ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2023..
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు.. మాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, బయోలాజీ, కంప్యూటర్ సైన్స్‌లలో ఒక సబ్జెట్ నుంచి క్లాస్ 12 పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2022 నవంబర్ 1- 2006 ఏప్రిల్ 30 మధ్యలో ఉండాలి.
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మొత్తం రెండు పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షతో పాటు రాత పరీక్ష- వైద్య పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ ఎగ్జామ్‌లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్న విలువ ఒక మార్కు.
ఇక ఈ నియామకాల కోసం అప్లై చేస్తున్న అభ్యర్థుల ఎగ్జామ్ ఫీజు రూ. 500 ప్లస్ జీఎస్టీగా ఉంది. అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఇతర వివరాల కోసం ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ఈ రోజే తుది గడవు..
ఇండియన్ నేవీ తలపెట్టిన 372 పోస్టుల భర్తీకి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ గడువు నేటితో ముగియనుంది. ఛార్జ్‌మెన్-2 పోస్టుల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్‌ను joinindiannavy.gov.in లో సబ్మీట్ చేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 18ఏళ్లు, గరిష్ఠంగా 25ఏళ్లు ఉండాలి.
- Indian Navy recruitment 2023 apply online : సంబంధిత అభ్యర్థులు ఏదైనా రికగ్నైజ్డ్ కాలేజీలో సైన్స్(ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మాథ్స్)లో డిగ్రీ పొంది ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఇతరులు రూ. 278ని అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2023 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం