Indian man puts eel in anus : రెండు అడుగుల ఈల్ చేపను మలద్వారంలో దూర్చుకున్న వ్యక్తి!
వియత్నంలో నివాసముంటున్న ఓ భారతీయుడు.. తన మలద్వారంలో ఈల్ చేపను దూర్చుకున్నాడు! దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా వైద్యులకు మరో షాక్ ఎదురైంది.
వియత్నంలో వైద్యులు షాక్ అయ్యే ఘటన ఒకటి జరిగింది. అక్కడ నివాసముంటున్న ఓ భారతీయుడు, అతని మలద్వారంలో ఒక సజీవంగా ఉన్న ఈల్ చేపను దూర్చుకున్నాడు! అది, అతని పేగులను తినేసింది. దానిని బయటకు తీయడానికి వైద్యులు చాలా కష్టపడ్డారు.
ఇదీ జరిగింది..
వియత్నం రాజధాని హనోయిలో జులై 27న జరిగింది ఈ ఘటన. ఓ భారతీయ వ్యక్తి తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అతడిని వెంటనే చికిత్స అందించారు. కానీ నొప్పికి అసలు కారణం తెలుసుకుని వైద్యులే షాక్‌కు గురయ్యారు. టెస్టులు చేయగా అతను, తన మలద్వారంలో 2 అడుగుల పొడవు, 4 ఇంచ్‌ల డయాటీర్తో ఉన్న ఈల్ చేప దూర్చుకున్నట్టు తేలింది. అది బయటకు వచ్చేందుకు చాలా ప్రయత్నించింది. ఫలితంగా సదరు వ్యక్తి పేగులు కోసుకుపోయాయి.
దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా డాక్టర్లకు మరో షాక్ తగిలింది. ఈల్ చేపను దూర్చుకున్న అనంతరం, ఒక పెద్ద నిమ్మకాయను కూడా తన మలద్వారంలో దూర్చుకున్నాడు ఆ వ్యక్తి. ఈల్ చేపను తీసేందుకు అది మరింత అడ్డుగా మారింది. ఫలితంగా ఆ భారతీయుడి మీద ఎమర్జెన్సీ సర్జరీ నిర్వహించారు. సర్జరీ చేసి 2 అడుగుల పొడవున్న ఈల్ చేపను బయటకు తీశారు. నిమ్మకాయను కూడా తొలగించారు. అనంతరం కొలొస్టొమీ నిర్వహించారు.
"ఈల్ ఆనోరోబిక్ కండీషన్స్‌లో బతకగలదు. అందుకే పేగులను కొరికేసింది. అందుకే ప్రజలు సజీవంగా ఉన్న జంతువులను, మలద్వారంలో పెట్టుకోకూడదు. ఏదీ పెట్టుకోకూడదు," అని వియత్నం వైద్యులు తెలిపారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వియత్నంలో ఇలాంటి ఘటన జరగడం ఇది తొలిసారి కాదు! విచిత్రంగా ఈ ఏడాదే ఇది రెండో ఘటన. ఓ 43ఏళ్ల వ్యక్తి తన మలద్వారంలో ఈల్ చేపను దూర్చుకోగా, దానిని వైద్యులు బయటకు తీశారు.
పురుషాంగంలోకి బ్యాటరీలు..
ఇలాంటి చిత్ర విచిత్ర సంఘటనలు ఎప్పటికప్పుడు వార్తాల్లో నిలుస్తూనే ఉంటున్నాయి. కొన్ని నెలల క్రితం, ఓ వ్యక్తి తృప్తి కోసం తన పురుషాంగంలోకి బ్యాటరీలను తోసుకున్నాడు! చాలా బాధ అనుభవించాడు. ఈ వార్త ఇన్స్టెంట్గా వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బయటకి వచ్చిన ఓ కథనం ప్రకారం.. ఆ వృద్ధుడి వయస్సు 73ఏళ్లు. లైంగిక తృప్తి కోసం తన పురుషాంగంలోకి చిన్న చిన్న వస్తువులు చొప్పించుకోవడం ఆయనకు అలవాటు. వాటిని ఏదో ఒక విధంగా మళ్లీ బయటకు తీసేసేవాడు. అదే విధంగా.. కొన్ని రోజుల క్రితం.. మూడు చిన్న సైజు, బటన్ స్టైల్ బ్యాటరీలను పీనిల్ యురేత్రాలోకి తోసుకున్నాడు. కానీ.. ఈసారి.. అవి బయటకు రాలేదు! అక్కడే ఉండిపోయాయి. మళ్లీ ప్రయత్నిచేసరికి.. అవి ఇంకాస్త లోపలికి వెళ్లిపోయాయి. ఈ ఘటన 24 గంటల తర్వాత.. సదరు వృద్ధుడు వైద్యుల దగ్గరికి పరుగులు తీశాడు. పరిస్థితని వివరించాడు. ఆ మాటలు విన్న వైద్యులు.. షాక్‌కు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం