Pegasus: ప్రముఖ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ స్పైవేర్; భారత ప్రభుత్వంపై ఆరోపణలు-indian government is targeting high profile journalists with pegasus report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pegasus: ప్రముఖ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ స్పైవేర్; భారత ప్రభుత్వంపై ఆరోపణలు

Pegasus: ప్రముఖ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ స్పైవేర్; భారత ప్రభుత్వంపై ఆరోపణలు

HT Telugu Desk HT Telugu
Dec 28, 2023 04:05 PM IST

Pegasus: ఫోన్ సందేశాలు, ఈమెయిల్స్ యాక్సెస్ చేయడానికి, ఫోటోలను పరిశీలించడానికి, కాల్స్, లొకేషన్లను ట్రాక్ చేయడానికి, యజమానిని కెమెరాతో చిత్రీకరించడానికి పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AP)

Pegasus Spyware: పెగాసస్ స్పై వేర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్ సహా ప్రపంచంలోని ప్రముఖ పాత్రికేయులు లక్ష్యంగా భారత ప్రభుత్వం పెగాసస్ స్పై వేర్ ను ప్రయోగిస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, వాషింగ్టన్ పోస్ట్ ఒక సంచలన నివేదిక విడుదల చేశాయి.

ఏమిటీ పెగాసస్?

ఇజ్రాయెలీ సంస్థ NSO గ్రూప్ ఈ పెగాసస్ స్పై వేర్ (Pegasus) ను సృష్టించింది. దీనిని ఫోన్లలోని సందేశాలు, ఇమెయిల్‌లను యాక్సెస్ చేయడానికి, ఫోటోలను పరిశీలించడానికి, కాల్స్ ను వినడానికి, లొకేషన్ లను ట్రాక్ చేయడానికి, కెమెరాతో యజమానిని చిత్రీకరించడానికి ఉపయోగించవచ్చు. భారతదేశంతో సహా చాలా దేశాల్లోని జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా ఈ స్పై వేర్ ను ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వాలు లేదా భద్రతా సంస్థలకు మాత్రమే ఈ స్పై వేర్ ను విక్రయిస్తారు.

జర్నలిస్ట్ లు లక్ష్యంగా..

ది వైర్‌ (The Wire)కు చెందిన జర్నలిస్టులు సిద్ధార్థ్ వరదరాజన్, ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) కు చెందిన ఆనంద్ మంగ్నాలే తమ ఐఫోన్‌లలో ఈ స్పైవేర్‌ ను గుర్తించారని ఆమ్నెస్టీ తెలిపింది. అక్టోబర్ నెలలో యాపిల్ సంస్థ హెచ్చరించిన తరువాత ఈ విషయాన్ని ఆ ప్రముఖ జర్నలిస్ట్ లు గుర్తించారు. "భారతదేశంలో జర్నలిస్టులు తమ ఉద్యోగాలు చేయడం కోసం చట్టవిరుద్ధమైన నిఘా ముప్పును ఎదుర్కొంటున్నారు" అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్ హెడ్ డోన్చా ఓ సియర్‌బైల్ అన్నారు. ఆ ముప్పు విలేకరులకు కఠినమైన ప్రతికూల వృత్తి వాతావరణాన్ని కలిగిస్తుందన్నారు. ఈ నివేదికపై భారత ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు.

2021 లో కూడా..

న్యూ ఢిల్లీలోని ప్రముఖ జర్నలిస్టులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టడానికి పెగాసస్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించినట్లు 2021 లోనే ఆరోపణలు వచ్చాయి, 1,000 మంది ప్రముఖుల ఫోన్లలో స్పైవేర్ ను జొప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024